Mumbai-Pune Expressway accident:ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడెనిమిది వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఖోపోలి ఎగ్జిట్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఎక్స్‌ప్రెస్‌వే యొక్క ముంబై-బౌండ్ లేన్‌లో ఖోపోలి ఎగ్జిట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లుగా సమాచారం. ప్రమాదం కారణంగా ముంబై వైపు వెళ్లే వాహనాలను ప్రస్తుతానికి నిలిపివేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసు బృందం అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
#WATCH | Collision of 7 vehicles on Mumbai-Pune Expressway at Khopoli, four people injured#Maharashtra pic.twitter.com/lIIuClOERx
— ANI (@ANI) April 27, 2023
స్థానికుల సమాచారం మేరకు ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ వాహనం అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయగా.. దాని వెనుకున్న వచ్చే మరో వాహనం ఢీ కొట్టడం… ఇలా ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డు మధ్యలో ఆ వాహనదారుడు ఎందుకు బ్రేకులు వేయాల్సి వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read More: Rains in AP: ఏపీలో మరో వారం పాటు వర్షాలు