Semi-Final: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కు బెదిరింపు.. నిఘా పెంచిన ముంబై పోలీసులు..!

క్రికెట్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌లో (Semi-Final) భాగంగా బుధవారం (నవంబర్ 15) ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

  • Written By:
  • Updated On - November 15, 2023 / 10:54 AM IST

Semi-Final Clash: క్రికెట్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌లో (Semi-Final) భాగంగా బుధవారం (నవంబర్ 15) ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే అంతకుముందే మ్యాచ్‌ని టార్గెట్‌ చేస్తారనే బెదిరింపు వచ్చింది. వాస్తవానికి ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. అందులో మ్యాచ్ సమయంలో కొన్ని పెద్ద సంఘటనలు జరుగుతాయని చెప్పబడింది. ముంబై పోలీసులకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ట్విట్టర్ ద్వారా ఈ తరహా బెదిరింపులకు పాల్పడ్డాడు. విషయం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ముంబై పోలీసులు వాంఖడే స్టేడియం,దాని పరిసర ప్రాంతాలపై నిఘా ఉంచారు.

బెదిరింపు చేసిన వ్యక్తి తుపాకీ, హ్యాండ్ గ్రెనేడ్, బుల్లెట్ల ఫోటోతో సోషల్ మీడియా సైట్ X (గతంలో ట్విట్టర్) లో ముంబై పోలీసులను ట్యాగ్ చేశాడు. దీంతో పాటు మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిప్పులు చెరిగేస్తాం అనే సందేశంతో కూడిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు.

Also Read: India vs New Zealand: నేడే భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్.. కివీస్ పై టీమిండియా రివెంజ్ తీర్చుకుంటుందా..?

ముంబై పోలీసులు ఏం చెప్పారు..?

ముంబై పోలీసులు మాట్లాడుతూ.. ఈరోజు వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో దుర్మార్గమైన సంఘటన జరుగుతుందని ఓ గుర్తు తెలియని వ్యక్తి ముంబై పోలీసులకు X (గతంలో ట్విట్టర్)లో బెదిరింపు సందేశాన్ని పోస్ట్ చేశాడు. స్టేడియం పరిసరాలు, పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచాం. ఆ వ్యక్తి తన పోస్ట్‌లో ముంబై పోలీసులను ట్యాగ్ చేశాడు. ఒక ఫోటోలో తుపాకీ, గ్రెనేడ్లు, బుల్లెట్లను చూపించాడని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.