Site icon HashtagU Telugu

Varavara Rao : వ‌ర‌వ‌ర‌రావు పిటిష‌న్‌ను తిర‌స్క‌రించిన ముంబై ఎన్ఐఏ కోర్టు

Vara Vara Rao

Vara Vara Rao

కంటి శస్త్రచికిత్స చేయించుకునేందుకు మూడు నెలల పాటు హైదరాబాద్‌కు వెళ్లాలన్న వ‌ర‌వ‌ర‌రావు విజ్ఞప్తిని ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు తిరస్కరించింది. NIA ప్రత్యేక న్యాయమూర్తి రాజేష్ కటారియా మాట్లాడుతూ.. ఆగస్టు 18, 2022 నాటి ఉత్తర్వు నుండి మూడు నెలలలోపు నిందితులపై అభియోగాలు మోపడంతోపాటు పెండింగ్‌లో ఉన్న డిశ్చార్జి దరఖాస్తుపై కోర్టు ఏకకాలంలో నిర్ణయం తీసుకోవాలని.. ఈ స‌మ‌యంలో దరఖాస్తును అనుమతించడం సరైనది కాదుని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలంటూ వ‌ర‌వ‌ర‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కంటిశుక్లం శస్త్రచికిత్స కోసం హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతి కోరారు. బెయిల్ షరతుల ప్రకారం, ఎల్గార్ పరిషత్ విచారణ ముగిసే వరకు వ‌ర‌వ‌ర‌రావు ముంబైలోనే ఉండాలి. ఆగస్టు 10న, వైద్య కారణాలతో వ‌ర‌వ‌ర‌రావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.