Dream of Going Global Viral : అక్కడ కాఫీ తాగారంటే..ఆ బోర్డు చూడకుండా ఉండలేరు..

‘ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది’ ఇది కేవలం కంపెనీ ప్రమోషన్ మాట కాదు..నిజ జీవితానికి సంబంధించింది కూడా. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటె..అదే మనల్ని ఉన్నంత స్థాయికి చేరుస్తుంది. మనం పైకి ఎదగాలంటే కేవలం కష్టపడితే కాదు..మనం చేసే పని నలుగురికి తెలియాలి..అలానీ భారీగా డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. నలుగురికి చేరువై ఒక్క ఐడియా చాలు..ఆటోమేటిక్ గా మనకు గుర్తింపు తెస్తుంది. ప్రస్తుతం స్మార్ట్ యుగం నడుస్తుంది..జియో పుణ్యమా అని ప్రతి ఒక్కరు […]

Published By: HashtagU Telugu Desk
Mumbai Man's Roadside Coffee

Mumbai Man's Roadside Coffe

‘ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది’ ఇది కేవలం కంపెనీ ప్రమోషన్ మాట కాదు..నిజ జీవితానికి సంబంధించింది కూడా. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటె..అదే మనల్ని ఉన్నంత స్థాయికి చేరుస్తుంది. మనం పైకి ఎదగాలంటే కేవలం కష్టపడితే కాదు..మనం చేసే పని నలుగురికి తెలియాలి..అలానీ భారీగా డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. నలుగురికి చేరువై ఒక్క ఐడియా చాలు..ఆటోమేటిక్ గా మనకు గుర్తింపు తెస్తుంది. ప్రస్తుతం స్మార్ట్ యుగం నడుస్తుంది..జియో పుణ్యమా అని ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతూ..సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రపంచంలో ఏది జరిగిన..ఏ చిన్న విషయమైనా..క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని ఎలా సెలబ్రిటీని చేస్తుందో చెప్పలేని పరిస్థితి. ఒక్కో సందర్భంలో ఓవర్ నైట్ లో సోషల్ మీడియా సెలబ్రిటీ అయినవారు కూడా ఉన్నారు. ఆ మధ్య కచ్చా బాదం ఎంత పాపులర్ అయ్యిందో తెలియంది కాదు.

కచ్చా బాదం (kachha badam) పాట సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అసలు ఈ పాట ఎవరు పాడారు ? సింగర్ ఎవరు? ఈ పాట ఎలా వచ్చింది ? అన్న ప్రశ్నలు తలెత్తాయి నెటిజన్ల నుంచి. ఆఖరికి కచ్చా బాదం సింగర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ పాట పాడిన వ్యక్తి పేరు భూబన్ బద్యాకర్. ఒక్కపాటతోనే ఫేమస్ అయిన భుబన్ బద్యాకర్ తన వ్యాపారం కోసం ఈ పాట పాడుతుండేవాడు. కచ్చా బాదం అంటే.. బెంగాలీలో పచ్చివేరుశెనగ అని అర్థం. భుబన్ బద్యాకర్ తన వేరుశెనగలను విక్రయించడానికి పాటలు పాడుతూ కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటారు. ప్రజలు అతని శైలిని ఇష్టపడ్డారు. అతని పాటను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా భారీగా వైరల్ అయింది.

తాజాగా ఇప్పుడు ఓ యువకుడి టీ స్టాల్‌కు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన చిన్న కాఫీ స్టాల్ పెట్టిన యువకుడు.. ఎదురుగా బోర్డుపై ఓ నోట్ రాసి..అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు. మయాంక్ పాండే (Mayank Pandey) అనే యువకుడు ముంబై (Mumbai) మహానగరంలో రద్దీ రోడ్డు పక్కన ది కాఫీ బార్ (Coffee bar) పేరుతో చిన్న స్టాండ్‌పై కాఫీ స్టాల్ (coffee stall) పెట్టుకున్నాడు. అయితే ఇతడికి ఎప్పటికైనా తన కాఫీ స్టాల్‌ని అతి పెద్ద మార్కెట్‌గా తీర్చిదిద్దాలనేది ఆశయం. పదే పదే తన ఆశయం తనకు గుర్తుకు ఉండేలా వెరైటీ ప్లాన్ వేశాడు. తన దుకాణం ఎదుట ఓ బోర్డుపై ‘‘నేను నా కాఫీ బార్‌ను గ్లోబల్ మార్కెట్‌కు తీసుకెళ్లాలనుకుంటున్నాను’’.. అని పెట్టుకున్నాడు. తన వద్ద కాఫీ తాగడానికి వచ్చే వారంతా ఈ బోర్డు చూసి ఆశ్చర్య పడుతూ.. పని పట్ల యువకుడి అంకితభావం, చిత్తశుద్ధిని చూసి శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. కొందరు అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఈ బోర్డు ను కొందరు ఫోటో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. దీంతో ఈ వార్త (Viral news) నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మీ కోరిక నెరవేరాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’’.. అని కొందరు, ‘‘ఇలాంటి వారు ఎప్పటికైనా పైకి వస్తారు’’.. అని మరికొందరు, ‘‘కృషితో నాస్తి దుర్భిక్షం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Read Also : ‘శ్యామ్ బాబు’ పూర్తి వీడియో వచ్చేసింది..చూస్తారా..?

  Last Updated: 16 Aug 2023, 09:17 PM IST