Mumbai: మహారాష్ట్రలోని థానేలో జరిగిన సరస్వతి హత్య కేసులో నిందితుడు కీలక విషయాలు వెల్లడించాడు. పోలీసుల విచారణలో తాను సరస్వతిని హత్య చేయలేదని నిందితుడు మనోజ్ సాహ్ని చెప్పాడు. మనోజ్, సరస్వతి గత ఐదేళ్లుగా లిన్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.
శవాన్ని ముక్కలుగా కోసి కుక్కర్‌లో ఉడకబెట్టాడు
మనోజ్ (56) మీరా రోడ్‌లోని నయా నగర్ ప్రాంతంలో ఉన్న గీతా ఆకాష్‌దీప్ బిల్డింగ్‌లో తన లైవ్-ఇన్ భాగస్వామి సరస్వతి వైద్య (32)తో కలిసి నివసించాడు. మనోజ్ మొదట సరస్వతిని దారుణంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని అనేక ముక్కలుగా నరికినట్లు ఆరోపణలు వచ్చాయి. మృతదేహాన్ని పారవేయడానికి, ఆ ముక్కలను కుక్కర్‌లో ఉడకబెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి.
మనోజ్ ఇరుగుపొరుగు వారు అతని ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. వింత వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మనోజ్ సాహ్ని ఫ్లాట్‌లోకి ప్రవేశించిన పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చాలా కుండలలో సరస్వతి మృతదేహం ముక్కలను ఉంచాడు. వెంటనే పోలీసులు మనోజ్‌ని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Sudden Heart Attacks : సడెన్ హార్ట్ ఎటాక్స్ కు కారణమేంటి ? ఐఐటీ కాన్పూర్ రీసెర్చ్ ప్రాజెక్ట్
సరస్వతి ఆత్మహత్య చేసుకుంది: మనోజ్ సాహ్ని
పోలీసుల విచారణలో మనోజ్ పెద్ద విషయం బయటపెట్టాడు. తాను సరస్వతిని చంపలేదని, జూన్ 3న సరస్వతి ఆత్మహత్య చేసుకుందని మనోజ్ చెప్పాడు. సరస్వతి మరణానంతరం ఆమెను హత్య తానే హత్య చేసినట్లు అనుకుంటారు అని భయపడి, ఆమె మృతదేహాన్ని దొర్లకుండా చేయాలనీ నిర్ణయించుకున్నాడు. దుర్వాసన రాకుండా ఉండేందుకు ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ప్రెషర్ కుక్కర్‌లో ఉడకబెట్టినట్లు మనోజ్ పోలీసులకు తెలిపాడు. ఈ ఘటన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులకు తెలిపాడు.
ఇంటరాగేషన్‌లో మనోజ్ మరో కీలక విషయాన్ని వెల్లడించాడు. మనోజ్ తనకు హెచ్ఐవి+ అని పోలీసులకు చెప్పాడు. హెచ్‌ఐవి+గా ఉన్న అతని వాదనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మహిళకు కూడా వైరస్ సోకిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.
మనోజ్ వాదనపై విచారణ
సరస్వతి హత్య కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్ వచ్చింది. సరస్వతి మృతదేహం ముక్కలను సేకరించి పోస్టుమార్టంకు తరలించారు. సరస్వతి ఆత్మహత్య చేసుకుందా లేక హత్య అనేది పోస్టుమార్టం నివేదిక తర్వాతే తేలనుంది. అలాగే, హెచ్‌ఐవి+ పాజిటివ్‌గా ఉన్న మనోజ్ వాదనపై కూడా విచారణ జరుగుతుంది.