Mumbai Billionaires: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నివసిస్తున్న బిలియనీర్ల సంఖ్య ఎంతో తెలుసా..?

భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో నివసిస్తున్న బిలియనీర్ల (Mumbai Billionaires) సంఖ్య ఇప్పుడు చైనా రాజధాని బీజింగ్ కంటే ఎక్కువగా మారింది.

  • Written By:
  • Updated On - March 26, 2024 / 10:32 AM IST

Mumbai Billionaires: భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో నివసిస్తున్న బిలియనీర్ల (Mumbai Billionaires) సంఖ్య ఇప్పుడు చైనా రాజధాని బీజింగ్ కంటే ఎక్కువగా మారింది. ఈ నగరం తొలిసారిగా ఆసియా బిలియనీర్ రాజధానిగా అవతరించింది. ఈ సమాచారం హురున్ రీసెర్చ్ 2024 గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో వెల్లడైంది. ముంబైలో 92 మంది బిలియనీర్లు ఉండగా, బీజింగ్‌లో వారి సంఖ్య 91గా ఉంది. ప్రపంచం గురించి చెప్పాలంటే.. చైనాలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 814 కాగా భారతదేశంలో మొత్తం బిలియనీర్లు 271 మంది ఉన్నారు.

ప్రపంచంలో ముంబైకి ఏ స్థానం లభించింది..?

ఇక నగరాల గురించి మాట్లాడితే ఆసియాలోనే ముంబై మొదటి స్థానంలో ఉంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. ఈ నగరం ఇప్పుడు మూడవ స్థానానికి చేరుకుంది. హురున్ జాబితా ప్రకారం..119 మంది బిలియనీర్లతో న్యూయార్క్ మొదటి స్థానంలో ఉంది. ఏడేళ్ల తర్వాత ఈ జాబితాలో న్యూయార్క్‌కు మొదటి ర్యాంక్‌ లభించింది. 97 మంది బిలియనీర్లు ఉన్న లండన్ రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాది ముంబైలో 26 మంది బిలియనీర్లు పెరిగారని, బీజింగ్‌లో 18 మంది తగ్గారు. అయితే, ప్రపంచ ర్యాంకింగ్‌లో భారతీయ బిలియనీర్ల స్థానం కాస్త బలహీనపడింది.

Also Read: Virat Kohli: ఛేజింగ్‌లో తగ్గేదే లే.. దటీజ్ కింగ్ కోహ్లీ..!

ముంబై బిలియనీర్ల మొత్తం సంపద ఎంత..?

కలల నగరంగా పేరొందిన ముంబైలోని బిలియనీర్లందరి సంపద కలిపి రూ.37 లక్షల కోట్లు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 47 శాతం పెరిగింది. అదే సమయంలో బీజింగ్ బిలియనీర్ల మొత్తం సంపద దాదాపు రూ.22 లక్షల కోట్లు. బీజింగ్‌లోని బిలియనీర్ల మొత్తం సంపద గత ఏడాదితో పోలిస్తే 28 శాతం క్షీణించింది. ముంబైలోని సంపద రంగాలు శక్తి, ఫార్మాస్యూటికల్స్. ముఖేష్ అంబానీ వంటి బిలియనీర్లు ఈ రంగాల నుండి గణనీయంగా లాభపడ్డారు.

We’re now on WhatsApp : Click to Join

ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది..?

ప్రపంచ బిలియనీర్ల జాబితా గురించి మనం మాట్లాడుకుంటే.. భారతీయ బిలియనీర్ల సంఖ్య కొంచెం బలహీనపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 10వ స్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ ఎనిమిదో ర్యాంక్‌ను పొందగా, హెచ్‌సిఎల్‌కి చెందిన శివ నాడార్, అతని కుటుంబం 16వ ర్యాంక్‌ను పొందారు. కానీ సీరమ్ ఇనిస్టిట్యూట్‌కి చెందిన సైరస్ ఎస్ పూనావాలా ర్యాంకు పడిపోయింది. అతని ర్యాంక్ 9 స్థానాలు దిగజారి 55వ స్థానానికి చేరుకుంది. సన్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన దిలీప్ సంఘ్వీ 61వ ర్యాంకు, కుమార్ మంగళం బిర్లా, రాధాకృష్ణ దమానీ 100వ ర్యాంకు సాధించారు.