Site icon HashtagU Telugu

Mumbai: యువకుడిని చావబాదిన జిమ్‌ ట్రైనర్‌

Mumbai

Mumbai

Mumbai: రోజురోజుకి మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుంది. పంతాలకు పోయి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. లేనిపోని ఈగోలకు పోయి సమస్యల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఓ జిమ్ ట్రైనర్ తన ఇగో కారణంగా కటకటాల పాలయ్యాడు. తనవైపు చూసినందుకు ఓ యువకుడిని చితకబాదాడు. దీంతో ప్రస్తుతం జిమ్ ట్రైనర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. వివరాలలోకి వెళితే..

ముంబైలోని ములుంద్ ప్రాంతంలో జిమ్ ట్రైనర్(Gym trainer) ఓ యువకుడిపై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు ట్రైనర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. 20 ఏళ్ల బాధిత యువకుడు జిమ్‌లో నిలబడి వేరే వాళ్ళతో మాట్లాడుతుండగా జిమ్ ట్రైనర్ కోపంతో అతనితో వాగ్వదానికి దిగాడు. ఈ తతాంగం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

ముంబైలోని ములుంద్ ప్రాంతంలో ఫిట్‌నెస్ ఇంటెలిజెంట్ జిమ్‌లో ఈ ఘటన జరిగింది. వ్యాయామం కోసం ఉపయోగించే ఒక చెక్క ముడ్గల్‌తో దాడి చేయడం వీడియోలో చూడొచ్చు. ఈ ఘటన జూలై 17న జరిగింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది. యువకుడు జిమ్‌లో ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, అతనికి కొంత దూరంలో ఉన్న జిమ్ ట్రైనర్ అతడిని గమనిస్తున్నాడు. కొంత సమయం తరువాత, శిక్షకుడు ఒక అతని వైపుకు వెళ్లి అతని తలపై కొట్టాడు. ట్రైనర్ ప్రవర్తనతో జిమ్ కి వచ్చిన వారు ఆశ్చర్యపోయారు. అతడిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు.

ఈ కేసులో యువకుడు యుగేష్ ఫిర్యాదు మేరకు నవ్‌ఘర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు ట్రైనర్‌ను అరెస్టు చేశారు. విచారణ సమయంలో జిమ్ ట్రైనర్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. కేవలం సదరు యువకుడు తనవైపు చేసినందుకే యువకుడిని కొట్టినట్టు పేర్కొన్నాడు. అలా చూడటం జిమ్ ట్రైనర్ కి నచ్చలేదట, ఈ నేపథ్యంలోనే కోపంతో దాడి చేసినట్లు జిమ్ ట్రైనర్ విచారణలో తెలిపాడు.

Also Read: Bajaj Freedom 125 vs Hero Xtreme-125: ఆ కంపెనీ బైక్స్ కి పోటీగా నిలుస్తున్న బజాజ్ సీఎన్‌జీ బైక్?