దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ అలర్ట్ అయింది. న్యూ ఇయర్ వేడుకలను టార్గెట్ గా చేసుకొని కాళిస్థని ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ హెచ్చరించింది. వెంటనే అలర్ట్ అయిన మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సెలవులను రద్దు చేస్తూ అందరిని విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ముంబై నగరవ్యాప్తంగా సెక్షన్ 144ను విధించినట్టు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్ చైతన్య తెలిపారు.
జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రతీ చోట భారీగా పోలీసులను మోహరించారు. నగరంలో ప్రతి వాహనాన్ని, అనుమానం ఉన్న ప్రతీ ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.