Site icon HashtagU Telugu

Mumbai Batters: దంచికొట్టిన ముంబై బ్యాటర్లు.. చిత్తుగా ఓడిన బెంగళూరు

Mumbai Indians

Mumbai Indians

Mumbai Batters: ఐపీఎల్ 17వ సీజన్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Batters) గాడిలో పడింది. గత మ్యాచ్ లో ఢిల్లీపై గెలిచి గెలుపు బాట పట్టిన ఆ జట్టు తాజాగా రెండో విజయాన్ని అందుకుంది. హోం గ్రౌండ్ వాంఖడే వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కేవలం 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఈ దశలో రజత్ పటీదార్‌తో కలిసి ఫాఫ్ డుప్లెసిస్ జట్టును ఆదుకున్నారు. రజత్ పటీదార్ ట్రేడ్ మార్క్ సిక్స్‌లతో చెలరేగి 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

తర్వాత దినేశ్ కార్తీక్ సాయంతో ఇన్నింగ్స్ కొనసాగించిన డుప్లెసిస్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.డుప్లెసిస్ ఔట్ అయ్యాక దినేశ్ కార్తీక్ విధ్వంకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఆకాశ్ మధ్వాల్ వేసిన 16వ ఓవర్‌లో దినేశ్ కార్తీక్ ఒకే తరహా ఇన్నోవేటివ్ షాట్స్‌తో నాలుగు బౌండరీలు బాదాడు. దీంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది.మొత్తం మీద బుమ్రా 21 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి సంచలన బౌలింగ్‌తో అదరగొట్టినా బెంగుళూరు మంచి స్కోర్ సాధించింది.

Also Read: AP News: కానిస్టేబుల్ శంకర్రావు బలవన్మరణం చేసుకోవడం బాధాకరం : చంద్రబాబు నాయుడు

కాగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న వాంఖడే పిచ్ పై ముంబై బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ , రోహిత్ శర్మ తొలి ఓవర్ నుంచే భారీ షాట్లతో విరుచుకు పడ్డారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. దీంతో ముంబై పవర్ ప్లేలో 72 పరుగుల చేసింది. తొలి వికెట్ కి ఇషాన్ , రోహిత్ 8.5 ఓవర్లలో 101 పరుగుల జోడించారు. వీటిలో 90 రన్స్ బౌండరీల ద్వారా వచ్చినవే. ఇషాన్ కిషన్ కేవలం 34 బంతుల్లో 7 ఫోర్లు , 5 సిక్సర్లతో 64 పరుగుల చేయగా…రోహిత్ 38 రన్స్ కి ఔట్ అయ్యాడు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సూర్య కుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. వరుస బౌండరీలతో విరుచుకు పడ్డాడు.కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు , 4 సిక్సర్లు ఉన్నాయి.

We’re now on WhatsApp : Click to Join

సూర్య కుమార్ యాదవ్ 52 రన్స్ కు వెనుదిరిగినా అప్పటికే మ్యాచ్ వన్ సైడ్ గా మారిపోయింది. తర్వాత పాండ్య, తిలక్ వర్మ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. దీంతో ముంబై కేవలం 15.3 ఓవర్లలోనే 197 పరుగుల టార్గెట్ అందుకుంది. ఈ సీజన్ లో ముంబై కి ఇది రెండో విజయం.