Site icon HashtagU Telugu

Mulugu Police: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ తరగతులు!

Police

Police

జాకారంలోని జిల్లా శిక్షణా కేంద్రం (డీటీసీ)లో సబ్-ఇన్‌స్పెక్టర్లు, పోలీస్ కానిస్టేబుళ్లతో సహా హోంశాఖలో ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి మూడు నెలల పాటు ఉచిత ప్రీ రిక్రూట్‌మెంట్ కోచింగ్‌ను నిర్వహించేందుకు జిల్లా పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఏఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ మాట్లాడుతూ.. ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లకు వెళ్లలేని ఉద్యోగార్థుల ప్రయోజనం కోసం పోలీసు సూపరింటెండెంట్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆధ్వర్యంలో కోచింగ్ అందించనున్నట్లు తెలిపారు. “ఈ 90 రోజుల కోచింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు ఆహారం, వసతిని అందించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్రాత పరీక్ష సబ్జెక్టులపై తరగతులు నిర్వహిస్తుండగా, ఉదయం, సాయంత్రం నిపుణులైన కోచ్‌ల ద్వారా ఫిజికల్‌ ట్రైనింగ్‌ సెషన్‌ను అందజేస్తారని, పరీక్షల పురోగతిని అంచనా వేయడానికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.