Site icon HashtagU Telugu

TS: ములుగు MLA సీతక్కకు డాక్టరేట్…గుత్తికోయలపై…!!

Minister Seethakka

Minister Seethakka

ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. పొలిటికల్ సైన్స్ లో సోషల్ ఎక్స్ క్లూషన్ అండ్ డిప్రివేషన్ ఆఫ్ మై గ్రాంట్ ట్రైబల్స్ ఆఫ్ ఎర్ట్స్ వైల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనే అంశంలో సీతక్క పరిశోధన పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ప్రస్తుతం మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ టి తిరుపతిరావు గైడ్ ప్రొఫెసర్ గా వ్యవహరించారు.

ప్రొఫెసర్ ముసలయ్య, ప్రొఫెసర్ అశోక్ నాయుడు, ప్రొఫెసర్ చంద్రునాయక్ పర్యవేక్షణలో సీతక్క పరిశోధన చేశారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గుత్తికోయల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై చేసిన గ్రంథాన్ని సమర్పించారు. ఈ క్రమంలోనే ఉస్మానియా అధికారులు సోమవారం డాక్టరేట్ ను ప్రకటించారు. త్వరలోనే సీతక్క ఈ పట్టాను పొందనున్నారు.