Site icon HashtagU Telugu

UP polls: అఖిలేష్‌ కు బిగ్ షాక్‌.. బీజేపీలో చేరిన ములాయం కోడలు

Aparna

Aparna

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాది పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్న కోడలు అపర్ణ యాదవ్‌.. భాయతీయ జనతా పార్టీలో చేరింది. కొన్నాళ్లుగా బీజేపీతో టచ్‌లో ఉన్న అపర్ణ.. ఎన్నికల సమయంలో పార్టీ మారారు. కాగా, ఎస్పీ అధినేతగా అఖిలేష్‌ యాదవ్‌ ఎంపికైన తర్వాత తిరుగుబాటు చేశారు అపర్ణ యాదవ్‌.. కొంతకాలం పాటు సైలెంట్‌గా ఉన్న ఆమె.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో బీజేపీలో చేరి ఎస్పీకి షాక్‌ ఇచ్చారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలకు ప్రభావితం అయినట్టు తెలిపారు. ఇక, తనకు అవకాశం ఇచ్చినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. తాను దేశానికి సేవ చేసేందుకు ముందుకు వచ్చాను.. అందుకే బీజేపీలో చేరానన్నారు.