Site icon HashtagU Telugu

Mulayam Singh Yadav : స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ భార్య క‌న్నుమూత‌

Mulayam Singh Wife Imresizer

Mulayam Singh Wife Imresizer

గురుగ్రామ్: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ భార్య సాధనా గుప్తా యాదవ్ క‌న్నుమూశారు. ఆమె గ‌త కొంత‌కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండ‌టంతో నాలుగు రోజుల క్రితం మెదాంత మెడిసిటీ ఆసుపత్రిలో ఆమెను చేర్చారు. పరిస్థితి విషమించడంతో ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కి తరలించారు. కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో ఉన్న ఆమెను చూసేందుకు ములాయం సింగ్ యాదవ్ వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధన గుప్తా ములాయం సింగ్ యాదవ్ రెండవ భార్య, ఆమె అతని కంటే 20 సంవత్సరాలు చిన్నది. ఆమె కొడుకు పేరు ప్రతీక్ యాదవ్ కాగా, ఆమె కోడ‌లు అప‌ర్ణ యాద‌వ్ భార‌తీయ జ‌న‌తాపార్టీ నాయ‌కురాలిగా ఉన్నారు.