Mulayam Singh Yadav : ములాయం సింగ్ యాద‌వ్ మృతికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంతాపం

ఎస్పీ అధినేత, ఉత్త‌ర‌ప్ర‌దేవ్ మాజీ ముఖ్య‌మంత్రి ములాయం సింగ్ యాద‌వ్ ఆనారోగ్యంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి...

Published By: HashtagU Telugu Desk
Chandrababu Imresizer

Chandrababu Imresizer

ఎస్పీ అధినేత, ఉత్త‌ర‌ప్ర‌దేవ్ మాజీ ముఖ్య‌మంత్రి ములాయం సింగ్ యాద‌వ్ ఆనారోగ్యంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయ‌న మృతికి ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ గారి మరణవార్త త‌న‌ను ఎంతో బాధ కలిగించిందన్నారు. త‌న‌కు అత్యంత ఆప్తులు, సోదరుడిని ఈ రోజు కోల్పోయానని… 4 దశాబ్దాలుగా హుందా రాజకీయాలతో త‌న‌ను ఎప్పుడూ ఆకట్టుకున్న నేత ములాయం సింగ్ యాద‌వ్ అని చంద్ర‌బాబు తెలిపారు. ఆయనతో కలిసి గతంలో పనిచెయ్యడం త‌న‌ అదృష్టంగా భావిస్తున్నాన‌ని… తన ఆలోచనల ద్వారా లక్షలాది మంది జీవితాలను ములాయంసింగ్ యాద‌వ్ మార్చార‌న్నారు. అఖిలేష్ యాదవ్ సహా కుటుంబ సభ్యులకు, ఉత్తరప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

  Last Updated: 10 Oct 2022, 10:55 AM IST