Mukesh Ambani: 360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ (Mukesh Ambani), అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని అధిగమించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని అధిగమించి భారతీయులలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. హురున్ ఇండియా, 360 వన్ వెల్త్ మంగళవారం 360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023ని విడుదల చేశాయి. ఇది భారతదేశంలోని అత్యంత సంపన్నుల 12వ వార్షిక ర్యాంకింగ్. ఈ జాబితాలో గౌతమ్ అదానీ సంపద ముఖేష్ అంబానీ కంటే చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా అదానీ సంపదలో భారీ క్షీణత ఉంది.
ముఖేష్ అంబానీ సంపద ఎంత పెరిగింది?
గత దశాబ్దంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ $150 బిలియన్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిందని, ఇది భారతదేశంలోని ఇతర కార్పొరేషన్ల కంటే ఎక్కువ అని నివేదిక పేర్కొంది. ఈ కాలంలో ముఖేష్ అంబానీ సంపద 2014లో రూ.1,65,100 కోట్ల నుంచి 2023 నాటికి దాదాపు రూ.8,08,700 కోట్లకు పెరిగింది. సంపద నాలుగు రెట్లు పెరిగింది.
Also Read: UAE Golden Visa: యూఏఈ గోల్డెన్ వీసా అద్భుతమైన ప్రయోజనాలు
We’re now on WhatsApp. Click to Join.
గౌతమ్ అదానీ రెండో స్థానానికి పడిపోయాడు
నివేదిక ప్రకారం.. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రూ.474,800 కోట్ల ఆస్తులతో రెండో స్థానానికి పడిపోయారు. సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ ఎస్ పూనావాలా భారతదేశంలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తి. అతని సంపద రూ. 2,78,500 కోట్లు. హెచ్‌సిఎల్‌కి చెందిన శివ నాడార్ ఆస్తుల విలువ రూ. 2,28,900 కోట్లు. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. దీని తర్వాత గోపీచంద్ హిందూజా అండ్ ఫ్యామిలీ రూ.1,76,500 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, అధినేత దిలీప్ షాంఘ్వీ రూ.1,64,300 కోట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. 1,62,300 కోట్ల ఆస్తులతో ఎల్‌ఎన్ మిట్టల్, కుటుంబం, రూ. 1,43,900 కోట్ల ఆస్తులతో రాధాకిషన్ దమానీ, రూ. 1,25,600 కోట్ల ఆస్తులతో కుమార్ మంగళం బిర్లా, కుటుంబం మరియు రూ. 1,20,700 కోట్ల ఆస్తులతో నిరజ్ బజాజ్, కుటుంబం టాప్ 10 జాబితాలో ఉన్నాయి.
360 వన్ సహ వ్యవస్థాపకుడు, 360 వన్ వెల్త్ జాయింట్ సీఈఓ యతిన్ షా మాట్లాడుతూ.. ఇప్పుడు 1,319 మంది వ్యక్తులు రూ. 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులను కలిగి ఉన్నారని చెప్పారు. గత ఐదేళ్లలో 76 శాతం పెరుగుదల కనిపించిందని చెప్పారు. సింగపూర్, యూఏఈ, సౌదీ అరేబియా దేశాల ఉమ్మడి జీడీపీ కంటే ప్రజల సంపద రూ.109 కోట్లకు చేరిందని పేర్కొన్నారు.