Mukesh Ambani Diwali Gift : ఈ ఏడాది దీపావళికి(నవంబరు) ముందే రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL)కు చెందిన 36 లక్షల మంది షేర్ హోల్డర్లు దీపావళి చేసుకోనున్నారు..
ఈ దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కీలక నిర్ణయం ప్రకటించబోతున్నారట..
ఇప్పటివరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లో భాగంగా ఉన్న డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL)ని 2023 సెప్టెంబర్ నాటికి.. విడిగా స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ చేయాలని ముకేశ్ యోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క 36 లక్షల మంది వాటాదారులకు దీపావళికి ముందే అట్రాక్టివ్ గిఫ్ట్(Mukesh Ambani Diwali Gift) లభిస్తుందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. లిస్టింగ్ సందర్భంగా రిలయన్స్ వాటాదారులకు గిఫ్ట్ గా JFSL షేర్లను కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.
ఏమిటీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ?
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నికర విలువ (నెట్ వర్త్) రూ. 28,000 కోట్లు. దీనికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 6.1 శాతం వాటా ఉంది. ఈ వాటా విలువ దాదాపు 96 వేల కోట్ల రూపాయలు. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ యొక్క విభజనకు ఇప్పటికే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఆమోదం తెలిపింది. ఈసారి జరగబోయే రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో (AGM) Jio ఫైనాన్షియల్ సర్వీసెస్ ను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ చేసే అంశాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించే ఛాన్స్ ఉంది. అదే జరిగితే 36 లక్షల మంది రిలయన్స్ వాటాదారులకు JFSL షేర్లను అలాట్ చేస్తారని అంటున్నారు. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన తర్వాత.. మూలధన పరంగా దేశంలో ఐదో అతిపెద్ద ఫైనాన్స్ కంపెనీగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFSL) అవతరిస్తుంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీతో పోటీపడుతుంది. ఈ వార్తల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ బూమ్ అవుతోంది.