Site icon HashtagU Telugu

Biden Dinner-Indian Guests : మోడీకి బైడెన్ డిన్నర్.. హాజరైన ఇండియన్స్ వీరే

Biden Dinner Indian Guests

Biden Dinner Indian Guests

Biden Dinner-Indian Guests : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్.. భారత  ప్రధాని నరేంద్ర మోడీకి వైట్ హౌస్ లో ఇచ్చిన అధికారిక విందు సందడిగా సాగింది.ఈ డిన్నర్ సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, భారత ప్రధాని మోడీ తమ వైన్ గ్లాసులను తడుముకున్నారు. ఈ గ్రాండ్ ప్రోగ్రాంకు ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ఇంద్రా నూయి, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, యాపిల్ సీఈవో టిమ్ కుక్‌, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో(Biden Dinner-Indian Guests) ప్రెసిడెంట్ బైడెన్ మనవరాలు నవోమీ బిడెన్, ఆమె భర్త పీటర్ నీల్‌..  బైడెన్ కుమార్తె యాష్లే బిడెన్, ఆమె అతిథి సీమా సదానందన్.. బైడెన్ కొడుకు హంటర్ బైడెన్  కూడా పాల్గొన్నారు.

చెఫ్ నినా కర్టిస్ నేతృత్వంలోని  వైట్ హౌస్ చెఫ్‌ లు స్టేట్ డిన్నర్ కోసం మెనూను సిద్ధం చేశారు. ఈ మెనూలో నిమ్మకాయ-మెంతులు పెరుగు సాస్, క్రిస్ప్డ్ మిల్లెట్ కేక్‌లు, సమ్మర్ స్క్వాష్‌లు, మెరినేట్ చేసిన మిల్లెట్, గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సలాడ్, కంప్రెస్డ్ పుచ్చకాయ, టాంగీ అవోకాడో సాస్, స్టఫ్డ్ పోర్టోబెల్లో మష్రూమ్‌లు, క్రీమీ కుంకుమపువ్వుతో కలిపిన రోజ్, షార్ట్ రిసోట్టోమ్ ఉన్నాయి.  “అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరాన్ని జరుపుకోవడానికి భారతదేశం నేతృత్వం వహిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. అందుకే మేము మా మెనూలో మెరినేట్ చేసిన మిల్లెట్‌లను చేర్చుకున్నాం” అని నినా కర్టిస్ చెప్పారు.

Also read : Submersible Vs Submarine : సబ్‌ మెర్సిబుల్, సబ్ మెరైన్ మధ్య తేడాలు ఇవీ

మోడీకి బైడెన్ డిన్నర్.. హాజరైన ముఖ్య అతిథులు వీరే