Site icon HashtagU Telugu

Dhoni’s Production: ఎంఎస్. ధోని నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ఇదే!

Dhoni Production

Dhoni Production

ఇండియన్ క్రికెటర్ ఎంఎస్ ధోని, సాక్షి ధోని నిర్మాణ సంస్థ ధోని ఎంటర్‌టైన్‌మెంట్ తొలి ప్రాజెక్ట్ ‘ఎల్‌జీఎం’. ఎట్టకేలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహిస్తున్న ‘ఎల్‌జీఎం’ ఫస్ట్‌ లుక్‌ని ధోనీ తన అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీలో విడుదల చేశాడు. ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉది. ‘ఎల్‌జీఎం’ అంటే లెట్స్ గెట్ మ్యారీడ్ అని అర్థం. పెళ్లికి సంబంధించి ఓ వ్యక్తి తన తల్లి, ప్రేయసి మధ్య ఎలా ఇరుక్కుపోయాడనే విషయాన్ని ఇందులో ఫన్నీగా చూపించబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్‌లో ఉంది. త్వరలోనే పోస్ట్-ప్రొడక్షన్‌ స్టార్ట్ అవుతుంది. ‘ఎల్‌జీఎం’ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో హరీష్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా, అతడి తల్లిగా నదియా కనిపించనుంది. లవ్ టుడే సినిమాతో పాపులర్ అయిన ఇవానా, హీరోయిన్ గా నటిస్తోంది. యోగి బాబు, మిర్చి విజయ్ తో పాటు మరికొంత మంది ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో పాత్రల్లో కనిపిస్తారు. దర్శకుడు రమేష్ తమిళ్ మణి, ఈ సినిమాకు సంగీతం కూడా అందిస్తున్నాడు. తెలుగులో కూడా ఈ మూవీ రానుంది.