Site icon HashtagU Telugu

MS Dhoni: ధోనీ యాడ్ పై వివాదం.. తొలగించాలని ఆదేశం

Dhoniipl

Dhoniipl

ఐపీఎల్ 2022 సీజన్ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చేసిన ఓ యాడ్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఐపీఎల్‌ను ప్రసారం చేసే స్టార్‌స్పోర్ట్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థ ఈ సీజన్ కోసం ధోనితో ఓ యాడ్ చేయించింది. ఈ యాడ్ లో ఖాకీ చొక్కా.. ఖాకీ ప్యాంటు.. వేసుకున్న ధోని బస్‌డ్రైవర్‌ గా అదరగొట్టాడు. ఈ వీడియోలో బస్సును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తోన్న ధోనీ.. ఓ షాప్ లో ఐపీఎల్ మ్యాచ్ రావడం గమనించి ఒక్కసారిగా రోడ్డు మధ్యలో బస్‌ని ఆపేస్తాడు. దాంతో.. ట్రాఫిక్ జామ్ అవుతుంది.. బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ ఆ మ్యాచ్ చూడాలనీ చెప్తాడు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది.

ఆ సమయంలో అటుగా వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బస్సును రోడ్డు మధ్యలో ఎందుకు ఆపేశావని ప్రశ్నించగా- సూపర్ ఓవర్ నడుస్తోందంటూ ధోని సమాధానం ఇస్తాడు ధోనీ. దాంతో ట్రాఫిక్ పోలీసు కూడా ఓకే తలా అంటూ వెళ్లిపోతాడు.. అయితే ఈ యాడ్ ఇప్పుడు వివాదంగా మారింది. ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తెరకెక్కించిన ఈ ఈ యాడ్‌‌పై మండిపడిన రోడ్ సేప్టీ ఆర్గనైజేషన్.. అడ్వర్‌టైజ్‌మెంట్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ)కి కంప్లైంట్ చేసింది. దాంతో.. ఈ యాడ్‌ను ఏప్రిల్ 20లోపు తొలగించాలని స్టార్ స్పోర్ట్స్ ను ఏఎస్‌సీఐ ఆదేశించింది. ఈ క్రమంలోనే స్టార్ స్పోర్ట్స్ధోనితో రూపొందించిన ఈ యాడ్‌ని తొలగించనున్నట్లు సమాచారం. ఇక ఐపీఎల్‌ 2022లో ఎంఎస్ ధోని ఆడుతున్న సీఎస్‌కే జట్టు ఇంకా బోణీ చేయలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్‌ పరాజయాలు చూసిన చెన్నై సూపర్ కింగ్స్ అనవసర ఒత్తిడిలో పడుతోంది.