CSK Wins Thriller: ధోనీ ఫినిషింగ్ టచ్…ముంబైకి మరో ఓటమి

ఐపీఎల్ 15వ సీజన్లో ముంబై ఇండియన్స్ రాత మారలేదు.

Published By: HashtagU Telugu Desk
Csk

Csk

ఐపీఎల్ 15వ సీజన్లో ముంబై ఇండియన్స్ రాత మారలేదు. వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. ఈ సీజన్ లో ముంబై ఇంతవరకు బోణీ కొట్టని ఆ జట్టు వరుసగా 7వ మ్యాచులోనూ పరాజయం పాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో ముంబై ఓటమి చవి చూసింది. ముంబై నిర్దేశించిన 156 పరుగుల టార్గెట్ ను చెన్నై జట్టు చివరి బంతికి గెలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో రాణించాడు. తిలక్ వర్మ 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 3 ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి మూడు వికెట్లు పడగొట్టాడు. డ్వేన్ బ్రావో రెండు వికెట్లు మిచెల్ సాంట్నర్, మహీశా తీక్షణ చెరో వికెట్ తీశారు.

లక్ష్య చెదనలో చెన్నై కూడా అనూహ్యంగా వికెట్లు కోల్పోయింది. డానియ‌ల్ సామ్స్ బౌలింగ్‌లో రుత్‌రాజ్ గైక్వాడ్ డ‌కౌట్ కాగా.. శాంట్న‌ర్ 11 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు.త‌రువాత రాయుడు, ఊతప్ప ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో రాయుడు 40, ఉతప్పా 30, ప‌రుగుల‌తో రాణించారు. చివరి ఓవర్లో సీఎస్‌కే విజ‌యానికి జయదేవ్ ఉనద్కత్ వేసిన‌ అఖ‌రి ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు కావ‌ల్సిన నేప‌థ్యంలో ధోని త‌న‌దైన శైలిలో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. వ‌రుస‌గా ఒక సిక్స్‌, రెండు ఫోర్లు బాది సీఎస్‌కేను విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. ఈ విజయంతో చెన్నై 2022 సీజన్ లో రెండో విజయాన్ని అందుకుంది.

  Last Updated: 22 Apr 2022, 12:03 AM IST