Site icon HashtagU Telugu

Dhoni: ధోనీ ధనా ధన్… అరుదైన రికార్డు

Dhoni As Uncapped Player

Dhoni As Uncapped Player

చెన్నై సూపర్ కింగ్స్ ఫాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అదేంటి తొలి మ్యాచ్ లో కోల్ కత్తా పై ఓడిపోతే ఎలా హేపీగా ఉన్నారని అనుకుంటున్నారా…ఫాన్స్ హాపీ గా ఉంది ధోనీ బ్యాటింగ్ ఫామ్ చూసి. ఆరంభ మ్యాచ్ లో ధోనీ దుమ్ము రేపాడు. దాదాపు మూడేళ్ళ తరువాత ఐపీఎల్ లో హాఫ్ సెంచరీ చేశాడు.ఐపీఎల్‌లో చివరిగా 2019 సీజన్‌లో ఆర్‌సీబీపై బెంగళూరులో 48 బంతుల్లో 84 పరుగులు చేసిన ఎమ్మెస్ ధోనీ, గత రెండు సీజన్లలో హాఫ్ సెంచరీ సాధించలేకపోయాడు. గత ఐపీఎల్‌లో అయితే మాహీ అత్యధిక స్కోరు 18 పరుగులే.

ఈ సీజన్‌లో కూడా మాహీపై పెద్దగా అంచనాలు లేవు. కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవడంతో మాహీ బ్యాటు నుంచి మెరుపులు చూసే అవకాశం దొరుకుతుందని ఎవ్వరూ అంచనా వేయలేదు. అసలు ఈ మ్యాచ్ లో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత తడబడింది. అయితే ధోనీ రాకతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అసలు 120 పరుగులన్నా చెన్నై చేస్తుందా అని సందేహాలు కలిగిన వేళ.. ఆ జట్టు ఏకంగా 131 పరుగులు చేసింది. కేవలం ధోనీ దనా దన్ ఇన్నింగ్స్ తో నే ఇది సాధ్యమైంది.

ఈ హాఫ్ సెంచరీతో ధోని ఖాతాలో అదిరిపోయే రికార్డు చేరింది.ఐపీఎల్‌లో అతి పెద్ద వయసులో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ద్రావిడ్ 40 ఏళ్ల 116 రోజుల వయసులో ఆఖరి హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇప్పుడు ధోనీ వయసు ప్రస్తుతం 40 ఏళ్ల 262 రోజులు. దీంతో రాహుల్ ద్రావిడ్ రికార్డును ధోనీ బ్రేక్ చేశాడు. మొత్తం మీద కెప్టెన్‌గా తప్పుకున్న తొలి మ్యాచ్‌లోనే ధోనీ తన మార్క్ చూపించాడంటూ చెన్నై అభిమానులు సంబరపడుతున్నారు.