MS Dhoni: చెపాక్ మైదానంలో ధోని మరొకసారి తన బ్యాటుకు పని చెప్పాడు. తన ఫెవరెట్ సిక్సులు బాదుతూ సిఎస్కె అభిమానులని అలరించాడు. చివరి ఓవర్‌లో మైదానంలోకి వచ్చిన మాహీ మరోసారి చెలరేగిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ లో చివరి రెండు బంతుల్లో ధోనీ రెండు సిక్సర్లు సాధించాడు.
20వ ఓవర్ తొలి బంతికే రవీంద్ర జడేజాను పెవిలియన్ బాట పట్టించాడు సామ్ కరన్. దీని తర్వాత బ్యాట్స్‌మెన్ క్రీజులో దిగాడు ఎంఎస్ ధోని. చివరి ఓవర్లో ధోని ఉంటె ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కోగలడు. ఇది క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు. అలాగే ఈ రోజు చివరి ఓవర్లో వచ్చి అభిమానుల్ని ఏ మాత్రం నిరాశపరచలేదు. ఇన్నింగ్స్ లో ధోని 4 బంతుల్లో 13 పరుగులు చేశాడు. ఆఫ్ సైడ్ వైపు తొలి సిక్స్ కొట్టిన ధోని, రెండో బంతిని మిడ్ వికెట్ మీదుగా బౌండరీ లైన్ దాటించాడు. ధోని ఈ రెండు సిక్సర్లతో చెపాక్ స్టేడియం హోరెత్తింది. ధోని తుఫాను బ్యాటింగ్ చూసి అభిమానుల ముఖాలు సంతోషంతో వెలిగాయి. దీంతో గ్రేటెస్ట్ ఫినిషర్ అంటూ స్టేడియం దద్దరిల్లిపోయింది
CSK బ్యాట్స్ మెన్ డెవాన్ కాన్వే కేవలం 52 బంతుల్లో 92 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్‌లో కాన్వేకు ఇదే అత్యధిక స్కోరు. CSK ఓపెనర్ తన భారీ ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు మరియు ఒక సిక్సర్ కొట్టాడు, 176 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో ఆడాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు బోర్డు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్, కాన్వాయ్ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించి తొలి వికెట్‌కు 86 పరుగులు జోడించారు. రుతురాజ్ 37 పరుగుల వద్ద అవుటయ్యాడు. అదే సమయంలో మూడో స్థానంలో ప్రమోట్ అయిన శివమ్ దూబే 17 బంతుల్లో 28 పరుగులు చేశాడు.
Read More: Devon Conway: చెపాక్ స్టేడియంలో డెవాన్ కాన్వే రికార్డు