Site icon HashtagU Telugu

Dhoni: బస్ డ్రైవర్ గా ధోనీ

Dhoni Imresizer

Dhoni Imresizer

ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొత్త లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బస్ డ్రైవర్ అవతారంలోఊర మాస్ లుక్ లో ఉన్న ధోనిని చూసి అభిమానులు షాక్‌ తిన్నారు. ఈనెల 26 నుంచి మే 29 వరకూ ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఇప్పటికే సూరత్ కి చేరుకున్న ధోనీ.. అక్కడచెన్నైసూపర్ కింగ్స్ క్యాంప్‌లో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే తాజాగా . ఐపీఎల్‌ 2022 ప్రమోషన్‌లో భాగంగా ధోని బస్ డ్రైవర్ లుక్‌తో దర్శనమిచ్చాడు.

ఐపీఎల్‌ను అధికారిక బ్రాడ్ కాస్టర్ గా ఉన్న స్టార్‌స్పోర్ట్‌ సంస్థ ఈ ప్రమోషన్‌ వీడియోను రూపొందించింది. ఈ వీడియోలో ఖాకీ చొక్కా.. ఖాకీ ప్యాంటు.. మేడలో రుమాలు వేసుకొని మెలితిప్పిన మీసంతో చేతిలో మైక్ పట్టుకొని ధోని దుమ్మురేపాడు.. ఇక వీడియో చివర్లో పోలీస్ కు సమాధానం చెప్తూ ఎంఎస్ ధోని ఇచ్చిన లుక్‌ హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోనూ స్టార్‌స్పోర్ట్స్‌ తసోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఇదిలాఉంటే.. ఐపీఎల్ 2022 చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అప్పుడే సూరత్‌లో క్యాంప్‌ని ఏర్పాటు చేసేసింది. ఈ క్యాంప్‌నకి ధోనీ, అంబటి రాయుడు, తుషార్ దేశ్‌పాండే, తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్‌-2022 సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మొత్తం మహారాష్ట్రలోనే జరగనుంది. ముంబై, పుణే వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ త్వరలోనే రిలీజ్ చేయనుంది.

Photo Courtesy: Twitter

 

Exit mobile version