MS Dhoni Announcement: మిస్టర్ కూల్.. బిస్కెట్ కంపెనీ అనౌన్స్‌మెంట్ కోస‌మా ఇదంతా..?

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ సోషల్‌మీడియా వేదికగా శనివారం అభిమానులనుద్దేశించి పెట్టిన ఓ కీలక ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

  • Written By:
  • Updated On - September 25, 2022 / 03:33 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ఆదివారం ఒక ప్రకటన చేశాడు. చాలా మంది అభిమానులు ధోనీ రిటైర్మెంట్ అవుతున్నాడ‌ని భావించినప్పటికీ.. అలాంటి వార్త ఏం ఎంఎస్ చెప్ప‌క‌పోవ‌డంతో ధోని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ధోనీ చెప్పిన ఆ బిగ్ ఎనౌన్స్‌మెంట్ విని అభిమానులు మైండ్ బ్లాంక్ కావ‌డంతో పాటు సంతోషం వ్య‌క్తం చేశారు. 41 ఏళ్ల ధోనీ ఓరియో బిస్కెట్‌ను విడుదల చేశాడు. ఈ మేరకు ధోనీ ఓరియో నిర్వాహ‌కులు ఏర్పాటు చేసిన‌ సమావేశంలో ఎనౌన్స్ చేశారు.

అయితే.. ఈ న్యూస్ వైర‌ల్ కావ‌డం కోసం ధోనీ శ‌నివారం తన సోషల్ మీడియా పేజీలో సెప్టెంబర్ 25న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఓ బిగ్ న్యూస్‌తో ప్రత్యక్ష ప్రసారంలో వస్తానని చెప్పాడు. ధోనీ ఆగస్ట్ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విష‌యం తెలిసిందే. రిటైర్మెంట్ అనంత‌రం ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ తర‌పున ఆడుతున్నాడు.

రెండేళ్ల క్రితం అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్‌లో సీఎస్‌కే జ‌ట్టు త‌ర‌పున ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కేకు కెప్టెన్‌గా ఎన్నో విజయాలను అందించిన విష‌యం తెలిసిందే. ఐపీఎల్‌లో ధోనీ నాయ‌క‌త్వంలో సీఎస్‌కే ఇప్ప‌టివ‌ర‌కు 4 సార్లు క‌ప్ సాధించింది. ధోని తన అంతర్జాతీయ కెరీర్‌లో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో ఆరు సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డేల్లో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు చేశాడు. భారత్ తరపున టీ20ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ధోనీ టెస్టుల్లో 4876 పరుగులు, వన్డేల్లో 10773, టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో 1617 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్‌లో మొత్తం 361 మ్యాచ్‌లు ఆడిన ధోని 28 హాఫ్ సెంచరీలతో మొత్తం 7167 పరుగులు చేశాడు.