Mrf@1 lakh : లక్షకు చేరిన ఎంఆర్ఎఫ్ షేర్ ధర..దలాల్ స్ట్రీట్‌లో కొత్త చరిత్ర

Mrf@1 lakh : ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ (MRF) మంగళవారం దలాల్ స్ట్రీట్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. దీని ఒక్కో షేరు ధర రూ. 1 లక్షను తాకింది.

  • Written By:
  • Publish Date - June 13, 2023 / 11:59 AM IST

Mrf@1 lakh : ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ (MRF) మంగళవారం దలాల్ స్ట్రీట్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. దీని ఒక్కో షేరు ధర రూ. 1 లక్షను తాకింది. దీంతో ఇంత స్థాయిలో  షేరు ధర కలిగిన తొలి భారతీయ కంపెనీగా MRF రికార్డు సృష్టించింది. MRF కంపెనీ షేరు  ఉదయం 10:45 గంటలకు 1.04 శాతం పెరిగి  రూ. 1,00,000.95 దగ్గర ట్రేడ్ అయింది. MRF షేరు అనేది..  కాగితంపై భారతదేశపు అత్యంత ఖరీదైన స్టాక్. కానీ ప్రైస్-టు-ఎర్నింగ్స్ (P/E), ప్రైస్-టు-బుక్ విలువ (P/BV) వంటి కొలమానాల లెక్కన చూస్తే అది అత్యంత ఖరీదైన స్టాక్  కాదు.

Also read : Stock Market : ఈ స్టాక్ లో జస్ట్ 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి మరిచిపోయి ఉంటే…ఈ రోజు కోటీశ్వరులు.!!

MRF షేర్ ధర గత సంవత్సరం వ్యవధిలో 45 శాతానికి పైగా పెరిగింది. 2023 సంవత్సరం ప్రారంభం నుంచి ఈ షేరు దాదాపు 14 శాతం పెరిగింది. గడిచిన మూడేళ్లలో 82 శాతం రాబడిని ఈ స్టాక్ తన ఇన్వెస్టర్లకు అందించింది. Trendlyne డేటా ప్రకారం.. MRF స్టాక్ విలువ(Mrf@1 lakh) దాని జీవితకాల గరిష్ట స్థాయికి దగ్గరగా ఉంది. చాలామంది విశ్లేషకులు ఈ స్టాక్‌పై  “సెల్” రేటింగ్‌ను కలిగి ఉన్నారు. అయితే ఈ స్టాక్‌ ధర పెరిగేందుకు ఇంకా ఛాన్స్ ఉందని కొందరు  స్టాక్ మార్కెట్  సాంకేతిక విశ్లేషకులు భావిస్తున్నారు.