Site icon HashtagU Telugu

Santosh Kumar: గుజరాత్‌ అభయారణ్యం అద్బుతం!

Lion

Lion

గుజరాత్‌లోని GIR జాతీయ వన్యప్రాణుల అభయారణ్యం అద్భుతమైన అనుభవం అని ఎంపీ సంతోష్ కుమార్ కుమార్ అన్నారు. సైన్స్ & టెక్నాలజీ, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయన పర్యటనలో భాగంగా ఆయన గుజరాత్ ను సందర్శిస్తున్నారు. గురువారం జైరామ్ రమేష్ అధ్యక్షతన ఆయన GIR నేషనల్ పార్క్‌ను సందర్శించారు. నేషనల్ పార్క్ వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సింహం ఫోటోలను కెమెరాలో బంధించారు. నేషనల్ పార్క్ సందర్శనలో మంత్రముగ్ధులను చేసే ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని, ఆ అద్భుతమైన చిత్రాలు ఇవే అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు సంతోష్.