BJP MP: కేసీఆర్ పై ఎంపీ రఘునందన్ కీలక వ్యాఖ్యలు

  • Written By:
  • Publish Date - June 13, 2024 / 09:55 PM IST

BJP MP: గొర్రెల పథకం కేసు లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈడీ కేస్ నమోదు చేసినట్లు తెలిసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రెల కుంభకోణం కేసులో కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందంటూ రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రితం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని.. ఈ విషయం ఇంకా బయటికి రాలేందంటూ చెప్పుకొచ్చారు. తనకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిందంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు!

మెదక్‌లో జరిగిన విజయోత్సవ ర్యాలీ, సన్మాన సభలో ఎంపీ రఘునందన్ రావు ఈ మేరకు కామెంట్స్ చేశారు. జీవిత కాలం మెదక్ ప్రజలకు రుణపడి ఉంటానని, రఘునందన్ అంటే మాటల మనిషి కాదు చేతల మనిషి అంటూ చెప్పుకొచ్చారు. పైసలు, మందు ఓపెన్‌గా పంచినా మిగితా పార్టీల నేతలు ఓడిపోయారని ఎన్నికలను ప్రస్తావించారు. వెంకట్రామిరెడ్డి వెయ్యి కోట్లు పెడితే వాటిని లెక్కచేయకుండా గెలిచానని రఘునందన్ రావు తెలిపారు.