వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy)కి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి, ఎన్నికల ప్రక్రియలో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో ఆయన తాత్కాలికంగా జైలు నుండి బయటకు వచ్చి పార్లమెంట్‌లో తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కలిగింది.
Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్
కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మిథున్ రెడ్డి ఈనెల 11న సాయంత్రం 5 గంటలకు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ కావాలి. అంటే ఎన్నికల కార్యక్రమం పూర్తయిన వెంటనే మళ్లీ జైలుకు హాజరు కావాలని స్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పు నేపథ్యంలో ఆయనకు పరిమిత స్వేచ్ఛ లభించినప్పటికీ, చట్టపరమైన ప్రక్రియలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఈ కేసుతో పాటు మిథున్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు, ఆయనపై ఉన్న ఆరోపణలు, రాబోయే రోజుల్లో పార్టీకి ఆయన చేసే సేవలపై చర్చ జరుగుతోంది. కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఉపశమనం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటు వేయడం ద్వారా పార్టీకి కలిసివస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.