Viveka Murder Case : నేడు సీబీఐ విచార‌ణ‌కు క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి.. అరెస్ట్ చేసే ఛాన్స్‌..?

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన సూత్ర‌ధారుడిగా ఉన్న సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి

  • Written By:
  • Publish Date - April 17, 2023 / 07:41 AM IST

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన సూత్ర‌ధారుడిగా ఉన్న సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చిన్నాన్న వైఎస్ భాస్క‌ర్‌రెడ్డిని సీబీఐ అధికారులు నిన్న అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.ఈ నెల‌ఖారులోగా ఈ కేసు విచార‌ణ పూర్తి చేయాల‌న్న ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదేశాల‌తో సీబీఐ మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఈ రోజు క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిని స‌హానిందితుడిగా సీబీఐ విచార‌ణ‌కు రావాల‌ని నోటీసు ఇచ్చింది. ఈ రోజు మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాల‌యంలో అవినాష్ రెడ్డి విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు. పులివెందుల నుంచి అవినాష్ రెడ్డి హైద‌రాబాద్ బ‌య‌ల్దేరారు. స‌రిగ్గా మూడు గంట‌ల‌కు ఆయ‌న హైద‌రాబాద్ సీబీఐ కార్యాల‌యంకి చేరుకోనున్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ చేస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతుంది.