Site icon HashtagU Telugu

Kerala Train: కేరళలో కదులుతున్న రైలులో మహిళకు నిప్పంటించిన ఓ వ్యక్తి, ముగ్గురు మృతి,

Kerala Train

Kerala Train

కేరళలో(Kerala Train) దారుణం జరిగింది. కోజికోడ్ జిల్లాలో ఆదివారం కదులుతున్న రైలులో ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పక్కన ఉన్నవారు రైలులో నుంచి దూకి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎనిమిది మంది తీవ్రంగా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్చగా, మరో ముగ్గురు స్వల్ప కాలిన గాయాలతో కోజికోడ్‌లోని బేబీ మెమోరియల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఏడాది వయస్సున్న చిన్నారితో పాటు మరో ఇద్దరు మరణించారు.

ఈ ఘటన జరిగినప్పుడు అలప్పుజా నుండి కన్నూర్ వెళ్లే ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ కోజికోడ్ సెంట్రల్ స్టేషన్ నుండి బయలుదేరి ఎలత్తూర్ వంతెనపై ఉంది.D1 బోగీలో షాకింగ్ సంఘటన జరిగిందని, ఎర్రచొక్కా ధరించిన నిందితుడు మహిళతో పాటు ఆమెతో సహా ఇతర వ్యక్తుల మధ్య ఘర్షణ జరగడంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని రైలులోని ప్రయాణికులు తెలిపారు.

ఒక వ్యక్తి ఒక మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమెను కాపాడేందుకు ప్రజలు ప్రయత్నించగా మరికొందరికి గాయాలయ్యాయి. రైలులో పెద్ద గొడవ జరిగింది. ప్రజలు ఇతర కంపార్ట్‌మెంట్లలోకి పరిగెత్తారని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు గాయపడ్డారు, నిందితుడు రైలు నుండి దూకి తప్పించుకున్నట్లు తెలిపారు.