Site icon HashtagU Telugu

leopard: సిరిసిల్లలో ‘చిరుత’ సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు!

Leopard

Leopard

కొన్నిరోజులుగా స్తబ్ధుగా ఉన్న చిరుతల సంచారం మళ్లీ మొదలైంది. తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో ఓ ఆవును చంపేయడంతో గ్రామీణ ప్రాంతాలు భయపడిపోతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివలింగపల్లిలో చిరుతపులి ఆవును చంపిన ఘటన స్థానికుల్లో భయాందోళనకు గురిచేస్తోంది. పుత్తా అనంత రెడ్డి అనే స్థానిక రైతు తన పశువులను పొలంలో కట్టేసి బుధవారం ఇంటికి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం తిరిగి వచ్చేసరికి చిరుతపులి దాడిలో తమ అవు చనిపోయినట్టు గుర్తించారు. ఆ ఆవు విలువ రూ.70,000 ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయం ఊరంతా పాకడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. పశువులను అడవులకు తీసుకెళ్లేప్పుడు జాగ్రత్తలు పాటించాలని, ఒంటరిగా తిరగకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు కోనరావుపేట ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. బుధవారం రాత్రి జరిగిన సంఘటనతో కోనరావుపేట మండల పరిధిలోని శివలింగాలపల్లి, మర్రిమద్ద, కంచర్ల, వీర్నపల్లి, అక్కపల్లి రైతులు రాత్రిపూట బయటికి వెళ్లవద్దని, నీటి కోసం అడవి జంతువులు నివాసాల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున పశువులను రక్షించుకోవాలని అధికారులు హెచ్చరించారు.