China: చైనా హాస్పిటల్ క్యాంటీన్ లో కలకలం.. లంచ్ బాక్స్ లో ఎలుక తల?

ఈ మధ్యకాలంలో చైనాలో అపరిశుభ్రత ఆహారంపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటువంటి వార్తలు వినిపిస్తూనే నేపథ్యంలో తాజాగా ఒక హా

  • Written By:
  • Publish Date - June 28, 2023 / 04:54 PM IST

ఈ మధ్యకాలంలో చైనాలో అపరిశుభ్రత ఆహారంపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటువంటి వార్తలు వినిపిస్తూనే నేపథ్యంలో తాజాగా ఒక హాస్పిటల్ క్యాంటీన్లో లంచ్ బాక్స్ లో ఎలుక తల తలపించడంతో అది కాస్త వివాదాస్పదంగా మారింది. ఒక ఓ వైద్య విద్యార్థి తీసుకున్న ఆహారంలో ఇది వెలుగు చూసినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ఒక నెల వ్యవధిలో చైనా క్యాంటీన్‌లలో ఈ తరహా ఘటన వెలుగు చూడడం రెండోసారి కావడం గమనార్హం.

కాగా చైనాలోని షియుషాన్‌ కౌంటీలో ఒక సంప్రదాయ ఔషధ ఆస్పత్రి ఉంది. అక్కడి క్యాంటీన్‌లో బాతు మాంసంతో చేసిన ఆహారాన్ని ఒక వైద్య విద్యార్థి తీసుకున్నారు. ఆ తర్వాత దాన్ని తెరచి చూడగా అందులో బాతు తలకు బదులు ఎలుక తల ఉంది. వెంటనే వైద్య విద్యార్థి స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయగా అది ఎలుక తలగానే నిర్ధారించారు. అయితే, ఆహారంలోకి అదెలా వచ్చిందనే విషయంపై స్పష్టత లేదు. ఈ విషయాన్ని స్థానిక మున్సిపాలిటి అధికారులు కూడా ధ్రువీకరించారు. దాంతో ఇదికాస్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల అనగా జూన్‌ 1వ తేదీన షియాంగ్‌షి ఇండస్ట్రీ పాలిటెక్నిక్‌ కాలేజీలోనూ ఇటువంటి ఘటనే వెలుగు చూసింది. కాలేజీ క్యాంటీన్లో తీసుకున్న ఆహారంలో ఎలుక తల ఉన్నట్లు ఒక విద్యార్థి గుర్తించారు. కానీ, కాలేజీ యాజమాన్యం అది బాతు తల అని కపిపుచ్చే ప్రయత్నం చేసింది. అధికారుల దర్యాప్తులో మాత్రం అది ఎలుకదేనని తేలింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది.