Moto G22:మోటో జి22 స్మార్ట్ ఫోన్ లాంచ్..ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!!

భారత్ లో కోవిడ్ సంక్షోభం తగ్గిన నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ తయారీదారు కంపెనీలు తమ జోరు పెంచాయి. వరుసగా కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - April 14, 2022 / 06:10 AM IST

భారత్ లో కోవిడ్ సంక్షోభం తగ్గిన నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ తయారీదారు కంపెనీలు తమ జోరు పెంచాయి. వరుసగా కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలా..బడ్జెట్ ధరలో క ొత్త స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. మోటో జీ 22 పేరుత రిలీజ్ చేసిన ఈ స్మార్ ఫోన్ గురించి వివరాలు తెలుసుకుందాం.

ధర:
మోటో జి22 సింగిల్ 4జిబి, 64జిబి స్మార్ట్ ఫోన్ రూ. 10,999ధరతో ప్రారంభం కానుంది. కస్టమర్లకు బ్యాంక్ ఆఫర్ లతో వెయ్యి రూపాయల వరకు తగ్గింపుతో ఈ స్మార్ట్ ఫోన్ను పొందవచ్చు. అయితే ఈ ధర స్టాక్ ఉన్నంత వరకే మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 13, 14 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ను ప్రత్యేకంగా ఫ్లీప్ కార్టులో బుధవారం మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఐస్ బర్గ్ బ్లూ, కాస్మిక్ బ్లూతో సహా రెండు వేరియంట్లలో లభిస్తోంది. త్వరలోనే మింట్ గ్రీన్ కలర్ లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది.

స్పెసిఫికేషన్లు :
మోటో జి22 90Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్టుతో 6.5 అంగుళాల మాక్స్ విజన్ డిస్ ప్లేతో వస్తుంది. 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజీతో కూడిన మీడియా టెక్ హెలియో జి 37 ప్రాసెసర్ తో స్మార్ట్ ఫోన్ పవర్ చేయబడింది. మైక్రో ఎస్డి కార్డు ద్వారా స్టోరేజీని విస్తరించుకోవచ్చు.

ఇక కెమెరా విషయానికొస్తే..మోటో జి22 స్మార్ట్ ఫోన్ బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ లెన్స్ తోపాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా ఉంటుంది. తక్కువ ధరకే 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ లెన్స్ అందిస్తోన్న మొట్ట మొదటి కంపెనీ మోటోరోలా. అంతేకాదు మాక్రో సెన్సార్ తోపాటు డెప్త్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.