New Born Baby Girl Sold For Rs 800 : ఆమె తన బిడ్డకు కూడా రేటు కట్టింది..
అప్పుడే పుట్టిన ఆడపిల్లను రూ.800కే అమ్మేసింది..
తనకు రెండోసారి పుట్టిన ఆడ శిశువును ఆ తల్లి వద్దు అనుకుంది..
ఈవిషయం ఆ మహిళ భర్తకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో మహిళను పోలీసులు విచారించి చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు.
మహిళతో సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా ఖుంటా పోలీసు స్టేషన్ పరిధిలోని మహూలియా గ్రామంలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కనికరం లేని ఆ తల్లి నుంచి ఆడ శిశువును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవజాత శిశువును విక్రయించిన కేసును ఆమెపై నమోదు చేసి అరెస్ట్ చేశారు. తన భర్త పనిపై తమిళనాడుకు వెళ్లిన టైంలో.. ఆ మహిళ తన 8 నెలల ఆడబిడ్డను రూ.800కు (New Born Sold For Rs 800) మాహీ ముర్ము అనే వ్యక్తి మధ్యవర్తిత్వంతో ఫుల్‌మండి మరాండి, టుదుకుడ్ దంపతులకు విక్రయించింది. సోమవారం రోజు (జులై 3న) పసికందు అమ్మకం జరిగింది.
Also read : Israel: ఇజ్రాయెల్‌పై 5 రాకెట్లను ప్రయోగించిన గాజాలోని ఉగ్రవాదులు
అయితే తమిళనాడు నుంచి ఒడిశాకు తిరిగి వచ్చాక మహిళ భర్తకు.. తన బిడ్డను అమ్మేసిన విషయం తెలిసింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. “తమిళనాడు నుంచి నేను ఇంటికి వచ్చేసరికి నా చిన్న కూతురు కనిపించలేదు. అనంతరం నా భార్యను అడగగా.. బిడ్డను అమ్మేశానని చెప్పింది. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను” అని పసికందు తండ్రి చెప్పాడు. మధ్యవర్తి మాహీ ముర్ముతో పాటు రూ.800కు బిడ్డను కొన్న దంపతులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.