Mother saves toddler son: సూపర్ మామ్.. పూల్ లో మునిగిపోతున్న బుడ్డోడిని కాపాడుకుంది!!

నడుచుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చిన ఆ బుడ్డోడు.. అదేంటో తెలియక ఒక్కసారిగా అందులోకి దూకేశాడు.

Published By: HashtagU Telugu Desk
mother saves son

Mothet Son 1200x768 Imresizer

నడుచుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చిన ఆ బుడ్డోడు.. అదేంటో తెలియక ఒక్కసారిగా అందులోకి దూకేశాడు. ఆ మరుక్షణమే ఉరుకులు పరుగులతో వాళ్ళ అమ్మ వచ్చి.. బుడ్డోడి టీ షర్ట్ ను పట్టి పైకి లాగింది. అమ్మ ఒక్క క్షణం లేటు వచ్చినా.. బుడ్డోడు స్విమ్మింగ్ పూల్ లో మునిగి పోయేవాడు. ఈ వీడియో ఇప్పుడు
ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు “మదర్ ఆఫ్ ది ఇయర్” అని టైటిల్ పెట్టి షేర్ చేసిందో ట్విట్టర్ యూజర్. ఇప్పటికే 477,000 మంది ఈ వీడియోను చూడగా, వేలకొద్దీ లైక్‌లు వచ్చాయి. మరి కొంతమంది ఇంటర్నెట్ వినియోగదారులు ఆమెను “సూపర్ మామ్” అని కొనియాడారు.  “ఇది మూఢనమ్మకమో, కాదో నాకు తెలియదు కానీ.. పిల్లల భద్రత విషయానికి వచ్చేసరికి.. ఏదైనా ప్రమాదంలో పడతారు అనుకునేసరికి తల్లులందరికీ మానవాతీత సామర్థ్యాలు వస్తాయి. అతీత శక్తులు వస్తాయనుకుంటా..’ అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.. ఇంకో యూజర్ అయితే..“స్పైడర్ మ్యాన్ కనుక నిజమే అయితే.. అతను కూడా ఇంత చాకచక్యంతో పిల్లవాడిని రక్షించలేడు.” అని కామెంట్ చేశారు.

https://twitter.com/TheFigen/status/1520493230688808961

  Last Updated: 04 May 2022, 10:18 PM IST