Viral Video: పాము కాటు నుంచి కొడుకుని కాపాడిన తల్లి..వీడియో వైరల్?

సాధారణంగా పాములు కనిపిస్తే చాలు అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటాము. ఆ పాములు మనల్ని ఎక్కడ

  • Written By:
  • Publish Date - August 14, 2022 / 09:15 AM IST

సాధారణంగా పాములు కనిపిస్తే చాలు అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటాము. ఆ పాములు మనల్ని ఎక్కడ కాటేస్తాయో మనకు ఎక్కడ హాని కలిగిస్తాయో అని భయంతో పరుగులు పెడుతూ ఉంటారు. అయితే చాలామంది భయపడినట్టు గానే ఎంతోమంది ఈ పాముకాటు వల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. పాములు కూడా వాటికి మనం ఎక్కడ హానిచేస్తామో అన్న భయంతో మనం ఏం చేయకుండానే మనల్ని కాటేస్తూ ఉంటాయి. అయితే పాములలో ఎన్నో రకాల విష సర్పాలు కూడా ఉన్నాయి. కొన్ని రకాల పాములు కాటేస్తే గంటల వ్యవదిలోని ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి.

అయితే సాధారణంగా చిన్న పాములను చూస్తేనే మనం అల్లంత దూరం పరిగెడతాం. కానీ ఒక తల్లి మాత్రం తన ప్రాణాలకు తెగించి సైతం కొడుకుని ఒక పెద్ద పాము నుండి రక్షించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ భయంకరమైన ఘటన తాజాగా కర్ణాటకలోని మాండ్యాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒక తల్లి కొడుకు ఇద్దరూ బయటకు కలిసి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. మెటుకుల కిందన ఒక పెద్ద పాము పాకుతూ వెళ్తూ ఉంటుంది.

 

ఇంతలోనే ఆ తల్లి కుమారుడు బయటకు వస్తూ ఉండగా ఆ బాలుడు అనుకోకుండా వెళ్లి ఆ పాము తలపై కాలు పెడతాడు. వెంటనే అప్రమత్తమైన ఆపాము వెనక్కి తిరుగుతుంది. అది గమనించిన ఆ బాలుడు తల్లి వెంటనే ఆ బాలుని మళ్లీ అక్కడికి వెళ్లకుండా వెనక్కి లాక్కుంటుంది. అలా ఆ మహిళ ప్రాణాలకు తెగించి మరీ ఆ పాము భారీ నుంచి తన కొడుకుని రక్షించుకుంది. ఆ పాము ఆ పిల్లాడిని కాటు వేయడానికి పైకి లేచి పడగ విప్పింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఆ వీడియోని చూసిన నెటిజెన్స్ ఆ తల్లి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాక ఆ వీడియో చూస్తుంటేనే చాలా భయం వేస్తోంది. అటువంటిది ఆ తల్లి ప్రాణాలకు తెగించి తన కొడుకుని కాపాడుకోవడం ని చూసిన నెటిజన్స్ ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.