Mother Kills Daughter: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ముండియామ్‌సర్‌లో దారుణం చోటు చేసుకుంది. మొబైల్ ఫోన్ విషయంలో తల్లీకూతుళ్ల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన తల్లి ఇనుప రాడ్డుతో కూతురి తలపై కొట్టింది. తలకు గాయం కావడంతో కూతురు అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
22 ఏళ్ల విద్యార్థిని నికితా సింగ్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతోందని బిందాయక పోలీస్ స్టేషన్ ఆఫీసర్ భజన్‌లాల్ తెలిపారు. ఆమె తరచూ మొబైల్‌లో మాట్లాడుతూ ఉండేది. దీంతో తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తల్లి ఆమె మొబైల్‌ను దాచిపెట్టింది, ఈ కారణంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో తల్లి సీత కూతురి తలపై ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో ఆమె మృతి చెందింది.
నికితా తరచూ మొబైల్‌లో బిజీగా ఉండేదని పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. బంధువులు కూడా నికితా పై ఆగ్రహం వ్యక్తం చేసి రెండు నెలల పాటు మొబైల్‌ను దాచి ఉంచారు. అయితే ఇటీవల ఆమె తన బంధువులకు అవసరమైనప్పుడు మాత్రమే మొబైల్ ఉపయోగిస్తానని హామీ ఇచ్చింది. దీంతో బంధువులు నికితాకు మొబైల్ ఇచ్చినట్లు పొలిసు దర్యాప్తులో తేలింది.
సోమవారం సాయంత్రం నికిత మొబైల్‌లో ఎవరితోనో మాట్లాడుతుండగా చూసిన తల్లి ఆమె నుంచి ఫోన్ లాక్కొని అల్మారాలో ఉంచింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
Also Read: KTR: ఊసరవెళ్లి రంగులు మార్చుతది.. రేవంత్ రెడ్డి తేదీలు మారుస్తాడు: కేటీఆర్