Mother Killed Childrens : తల్లి కాదు రాకాసి..ఏడుస్తున్నారని పసి ప్రాణాలను చిదిమేసింది..!!

పిల్లలు ఏడుస్తుంటే…తల్లి మనస్సు తల్లడిల్లిపోతుంది. చిన్నారులకు ఏమైందో అంటూ వేదన చెందుతుంది. తన పిల్లల ఏడుపు తగ్గే వరకు ఆందోళన చెందుతుంది అమ్మ. అలాంటి అమ్మతనానికి మచ్చ తెచ్చింది మహారాష్ట్రకు చెందిన ఓ కసాయి తల్లి. నెలలు కూడా నిండని పిల్లలు ఏడుస్తున్నారన్న కారణంతో వారిని బాగా చూసుకోవల్సింది…వారిఏడుపును భరించలేనంటూ…చంపేసింది. అంతేకాదు గొంతు నులిమి చంపేసింది. తర్వతా వారిశవాలను పొలంలో కాల్చేసింది. ఈ ఘటన షాకింగ్ గా మారింది. అమ్మతనానికి మచ్చగామారిన ఈ పిశాచి తల్లి వ్యవహారం […]

Published By: HashtagU Telugu Desk
Child Abuse

Child Abuse

పిల్లలు ఏడుస్తుంటే…తల్లి మనస్సు తల్లడిల్లిపోతుంది. చిన్నారులకు ఏమైందో అంటూ వేదన చెందుతుంది. తన పిల్లల ఏడుపు తగ్గే వరకు ఆందోళన చెందుతుంది అమ్మ. అలాంటి అమ్మతనానికి మచ్చ తెచ్చింది మహారాష్ట్రకు చెందిన ఓ కసాయి తల్లి. నెలలు కూడా నిండని పిల్లలు ఏడుస్తున్నారన్న కారణంతో వారిని బాగా చూసుకోవల్సింది…వారిఏడుపును భరించలేనంటూ…చంపేసింది. అంతేకాదు గొంతు నులిమి చంపేసింది. తర్వతా వారిశవాలను పొలంలో కాల్చేసింది. ఈ ఘటన షాకింగ్ గా మారింది. అమ్మతనానికి మచ్చగామారిన ఈ పిశాచి తల్లి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

మహారాష్ట్రలోని భోకర్ లోని పాండుర్నాగ్రామానికి చెందిన దుర్పదాబాయ్ కు రెండేళ్ల కుమారుడు, నాలుగు నెలల అనసూయ అనే చిన్నారులు ఉన్నారు.అయితే పిల్లలు ఇద్దరు ఆపకుండా ఏడుస్తున్నారని ఆగ్రహానికి గురైంది. మే 31న నాలుగు నెలల కుమార్తె గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత రోజు ఆకలితో ఏడుస్తున్న నాలుగేళ్ల కుమారుడినికూడా చంపేసింది. కొడుకు గొంతు నులిమి చంపేసిన ఆమె…తన తల్లి, సోదురుడిని పిలుచుకునివారి శవాలను పొలంలో కాల్చేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు కూడా విస్మయానికి గురవుతున్నారు. తల్లితోపాటు..ఆమెకుసహకరించిన వారద్దర్నీకూడా పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. అమ్మతనానికే మాయని మచ్చగామారిన ఈ ఉదంతం విస్మయానికి గురి చేస్తోంది.

  Last Updated: 04 Jun 2022, 08:44 PM IST