Site icon HashtagU Telugu

Drug Habit: గంజాయికి బానిసైన కొడుకు.. తల్లి ‘కారం’ ట్రీట్ మెంట్!

Ganja

Ganja

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ గుప్పుమంటోంది. మారుమూల పల్లెలు మొదలుకొని.. హైటెక్ సిటీల వరకు జోరుగా దందా కొనసాగుతోంది. ఐటీ ఉద్యోగులు, బిటెక్ విద్యార్థులు, యువతే కాకుండా టీనేజర్స్ ఈ మహమ్మారి బారిన పడుతుండటం తల్లిదండ్రుల్లో తీవ్ర భయం నెలకొంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయికి బానిసైన 15 ఏళ్ళ కొడుక్కి తల్లి ఘాటు ట్రీట్‌మెంట్‌ ఇ‍చ్చింది. తల్లి పలుమార్లు నచ్చజెప్పినా కుమారుడి తీరు మారలేదు. దీంతో మరోసారి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మాట వినకపోవడంతో విసిగెత్తిన తల్లి కొడుకుని వీధుల్లోకి లాక్కొచ్చి విద్యుత్‌ స్తంభానికి కట్టేసింది. గంజాయి మత్తుతో చిత్తయిపోతున్న కొడకు కళ్లల్లో కారం కొట్టి దేహశుద్ధి చేసింది.  ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.