BSE Odisha Result 2023: మహిళ తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అందుబాటులో ఉన్న రిసోర్స్ ని వాడుకుంటూ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటున్నారు. పురుషులకంటే తామేమి తక్కువ కాదని నిరూపిస్తున్నారు. తాజాగా ఒడిశాలో 47 ఏళ్ళ మహిళ పదవి తరగతి ఫలితాల్లో ఉతీర్ణత సాధించడమే కాకుండా, తన కొడుకు కంటే ఎక్కువ మార్కులు సాధించి ప్రతిఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలిచింది. .
దృఢ సంకల్పం, కృషి మరియు అంకితభావంతో పని చేస్తే ఎంతటి స్థాయికి అయినా చేరుకోవచ్చు. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది తమ దృఢసంకల్పంతో సక్సెస్ అందుకుని నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఒడిశాలో జరిగిన సంఘటన పలువురిని ఆకట్టుకుంటుంది. 47 ఏళ్ళసుజాత నాయక్ పదవ తరగతి పరీక్షలో తన కుమారుడి కంటే ఎక్కువ మార్కులు సాధించింది. నిజానికి తల్లి, కొడుకు ఇద్దరూ 2023లో పదవి తరగతి పరీక్షలు రాశారు. అయితే ఈ పరీక్షలో కొడుకు కంటే తల్లి ఎక్కువ మార్కులు సాధించింది.
సుజాత ఒడిశా సెకండరీ బోర్డ్ మెట్రిక్యులేషన్ పరీక్ష 2023లో B2 గ్రేడ్ సాధించారు. కంధమాల్‌లోని దరింగిబడి ప్రాంతంలోని లాహోర్ సాహి నివాసి సుజాతా నాయక్ 47 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించారు. సుజాతా నాయక్ తన కొడుకు ఆయుష్‌తో కలిసి 10వ తరగతి పరీక్షకు హాజరయ్యారు. ఆసక్తికరంగా ఆమె తన కుమారుడు ఆయుష్ కంటే మెరుగైన గ్రేడ్‌లను సాధించారు. సుజాత 600 మార్కులకు 346 మార్కులు సాధించగా, ఆమె కుమారుడు డి గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 600 మార్కులకు 258 మార్కులు వచ్చాయి. సుజాత తన విజయానికి పూర్తి క్రేడిట్ని తన భర్తకు ఇచ్చారు. భర్త తాపీ మేస్త్రీగా పని చేస్తారని ఆమె తెలిపింది.
Read More: BRS Lucky : కేసీఆర్ కు వరంగా రూ. 2వేల నోట్ రద్దు