Covid: కొవిడ్‌ భయంతో అన్ని ఏళ్లు ఇంట్లోనే తల్లీకొడుకు… భర్త ఫిర్యా దుతో వెలుగులోకి!

కొవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. రెండేళ్లపాటు అతలాకుతలం చేసింది. ఆ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు బండి నడిపించారు. ఇప్పటికీ అనేక మంది కొవిడ్‌ భయంతో మగ్గుతున్నారు.

  • Written By:
  • Publish Date - February 22, 2023 / 09:43 PM IST

Covid: కొవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. రెండేళ్లపాటు అతలాకుతలం చేసింది. ఆ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు బండి నడిపించారు. ఇప్పటికీ అనేక మంది కొవిడ్‌ భయంతో మగ్గుతున్నారు. ఎక్కడికి వెళ్లినా కొందరు మాస్కు ధరిస్తున్నారు. కొందరైతే కొవిడ్‌ వల్ల పిచ్చోళ్లైన వారు ఉన్నారు. ఓ కుటుంబం అయితే ఏకంగా కొన్నేళ్లపాటు ఇంటికై పరిమితమైంది.ఈ ఘటన వింటే మీకు ఆశ్చర్యం వేస్తోంది.

గురుగ్రామ్‌లోని చక్కర్‌ పూర్‌‌ ప్రాంతానికి చెందిన మున్మున్‌ మాఝీ అనే మహిళ తన ఎనిమిదేళ్ల కొడుకు కోవిడ్‌ మహామ్మారి వచ్చింది. సరిగ్గా 2020 నుంచి ఇప్పటి వరకు గృహ నిర్బంధంలో ఉండిపోయారు.కనీసం ఆ మహిళ కొడుకు సూర్యుడు ఉదయించడాన్నీ చూడకుండా అలా ఇంట్లో ఉండిపోయాడు. ఆఖరికి ఆ భయంతో ఆమె తన భర్త సుజన్‌మార్జీను అస్సలు ఇంట్లోకి రానివ్వలేదు. ఆమె భర్త ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతను మొదట్లో స్నేహితులు, బంధవుల ఇళ్లల్లో తలదాచుకున్నా డు.

ఎంతకాలం ఇలా వారి ఇంట్లో వీరి ఇంట్లో ఉంటాననుకున్న ఆ వ్యక్తి… ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉండటం ప్రారంభించాడు. అప్పుడప్పుడూ వీడియో కాల్‌లోనే మాట్లాడుతుండేవాడు. తన భార్య కొడుకు ఉన్న ఇంటి అద్దె, తదితరాలు కట్టడం, వారికి కావాల్సిన వస్తువులు డోర్‌
ముంగిట పెట్టి వెళ్లిపోవడం ఇలానే మూడేళ్లు గడిచిపోయాయి. అయితే మున్మున్‌ మాత్రం లాక్‌డౌన్‌ ఎత్తేసి మాములుగా అయిపోయినా
ఇంకా అలా స్వయం నిర్బంధంలోనే ఉండిపోయింది. భర్త ఎంత నచ్చ చెప్పిన వినలేదు.

ఇక లాభం లేదని భావించిన ఆ భర్త పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి బయటు తీసుకువచ్చారు. ఆ మహిళ కనీసం వంటగ్యాస్‌ కానీ, నీటిని గానీ వినయోగించ లేదని వెల్లడించారు. కాగా ఆమె భర్త సుజన్‌ తన భార్య కొడుకుని బయటకు తీసుకొచ్చినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.