Site icon HashtagU Telugu

Without Helmet: హెల్మెట్‌ మాకేనా..పోలీసులకు ఉండవా..?

Without Helmet

Without Helmet

Without Helmet: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసుల తీరు పలు విమర్శలకు దారి తీస్తుంది. వెహికిల్ “కీ” తీసుకోవడం చట్టవిరుద్ధం. కానీ అవేం పోలీసులు లెక్క చేయరు. బండి ఆపడమే తరువాయి వాళ్ళు చేసే మొదటి పని వెహికిల్ కీ లాక్కోవడం. దీంతో వాహనదారులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇక సరైన పత్రాలు లేనందున వందలకు వందలు చలాన్లు విధించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ట్రాఫిక్ రూల్స్ కేవలం ప్రజలకేనా? అవి పోలీసులకు వర్తించవా?. పోలీసులు పబ్లిక్ లో భాగం కాదా? ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. తాజాగా ఓ పోలీసు అధికారి ట్రాఫిక్ ఉల్లంఘన వెలుగులోకి వచ్చింది. హెల్మెట్ ధరించని పోలీసు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో సోమవారం రాత్రి తల్లీకూతుళ్లు స్కూటీపై ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో హెల్మెట్‌ ధరించని ఇద్దరు పోలీసులను గమనించారు. కొంతదూరం ఆ పోలీస్ వెహికిల్ ని అనుసరించారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు పోలీసులు హెల్మెట్ లేకుండా పెట్రోలింగ్ చేస్తున్నారు. వారి వెనుక స్కూటీ నడుపుతున్న తల్లీకూతుళ్లిద్దరూ వారిని వీడియో తీసి, తరచూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ప్రశ్నించారు. అంతే కాదు ట్రాఫిక్ రూల్స్ సామాన్యులకు మాత్రమేనా అని తల్లీకూతుళ్లు పోలీసులను నిలదీశారు. హెల్మెట్ ధరించకుండా వెహికిల్ నడపడం ఏంటని ప్రశ్నించారు. ఈ తతాంగం అంత వీడియోలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో తల్లీ-కూతురు దాదాపు 1 కిలోమీటరు మేర పోలీసులను వెంబడించారు.ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో సంబంధిత పోలీసు అధికారుల బైక్‌కు వెయ్యి రూపాయలు చలానా విధించారు.

Read More: Mobile In Toilet: టాయిలెట్‌లో మొబైల్ వాడే అలవాటుందా..?ఈ వార్త చదువుతే సుస్సు పోసుకుంటారు