Site icon HashtagU Telugu

Most Popular Actors: అక్షయ్ కుమార్ దే అగ్రస్థానం!

Bollywood

Bollywood

ఓ ప్రముఖ మీడియా ఏజెన్సీ ఓర్మాక్స్ ఇటీవల దేశంలోని టాప్ స్టార్ల జాబితాను విడుదల చేసింది. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్‌లను ఓడించి బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ అగ్రస్థానంలో నిలిచాడు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల జాబితాలో అక్షయ్ మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాత SRK, సల్మాన్, హృతిక్, రణవీర్, అమీర్ ఉన్నారు. అక్షయ్ కుమార్ నిస్సందేహంగా పరిశ్రమలో కష్టపడి పనిచేసే వ్యక్తి. నిజాయితీగల స్టార్లలో ఒకరు. బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆయనకు ఖిలాడీ సినిమా రూపంలో అక్షయ్‌కి మొదటి పెద్ద బ్రేక్ వచ్చింది.

అతను ‘ఖిలాడీ’ టైటిల్‌తో ఏడు చిత్రాలలో నటించాడు – ‘ఖిలాడీ’, ‘మై ఖిలాడీ తూ అనారీ’, ‘సబ్సే బడా ఖిలాడీ’, ‘ఖిలాడియోన్ కా ఖిలాడీ’, ‘ఇంటర్నేషనల్ ఖిలాడీ’, ‘మిస్టర్ అండ్ మిసెస్ ఖిలాడీ’ మరియు ‘ఖిలాడీ. 420’. తన ఇటీవలి చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్ గురించి మాట్లాడుతూ.. అక్షయ్ కుమార్ విడుదలకు ముందు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ సినిమాపై నిషేధం విధించాలంటూ నెటిజన్లు పిటిషన్ వేశారు. అయితే, ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. రూ. 200 కోట్ల బడ్జెట్‌తో బాక్సాఫీస్ వద్ద రూ. 55 కోట్లు రాబట్టింది. బచ్చన్ పాండే తర్వాత ఇది అతని రెండవ వరుస ఫ్లాప్. అయినప్పటికీ, అక్షయ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.