Expensive Sheep: ఈ గొర్రె ధర రూ.2 కోట్లు..దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా?

సాధారణంగా గొర్రెలు, మేకలు లాంటి జంతువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే వీటిలో కొన్ని చిన్నవి తక్కువ

  • Written By:
  • Publish Date - October 5, 2022 / 09:16 AM IST

సాధారణంగా గొర్రెలు, మేకలు లాంటి జంతువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే వీటిలో కొన్ని చిన్నవి తక్కువ రేటు గాను కొంచెం పెద్దవి ఎక్కువ రేటుగా ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు ఆ గొర్రెల, మేకలు లాంటి జంతువులు ఆకారం వాటికున్న ప్రత్యేకత కారణంగా అవి లక్షలు కూడా పలుకుతూ ఉంటాయి. ఇది ఇప్పటికే ఎన్నో రకాల జంతువులు ఆ విధంగా లక్షలు, వేల ధరలు పలికిన విషయం తెలిసిందే. మనం తెలుసుకోబోయే గొర్రె మాత్రం ఏకంగా లక్ష కాదు రెండు లక్షల కాదు ఏకంగా రెండు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.

గొర్రె రెండు కోట్లు ఏంటా అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని ఒక గొర్రె రెండు కోట్ల రూపాయలకు అమ్ముడు అయింది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొర్రెగా కూడా ప్రపంచ రికార్డును సృష్టించింది. ఈ ఆస్ట్రేలియన్ వైట్ స్టడ్ షీప్ ను ఆస్ట్రేలియాలోని వ్యక్తుల సమూహం కొనుగోలు చేసింది. ఆ గొర్రెను దాదాపు రెండు కోట్లతో ఎలైట్ ఆస్ట్రేలియన్ వైట్ సిండికేట్ కొనుగోలు చేసింది. కాగా ఈ సిండికేట్ లో న్యూ సౌత్ వెల్స్ కు చెందిన నలుగురు సభ్యులు ఉన్నారు.

దీనినే సిండికేట్ సభ్యుడు స్ట్రీవ్ ఫెడ్రిక్ ఎలైట్ షిప్ గా పేర్కొన్నాడు.. అయితే ఆ గొర్రెల యజమాని ఆ గొర్రె అంతా ఎక్కువ దరకు పలుకుతాయని ఊహించలేదు అని తెలిపారు. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా గొర్రెను చూడటానికి పెద్ద ఎత్తున అక్కడికి తరలివస్తున్నారు.