Costliest Pillow : వామ్మో.. ఈ దిండు ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎంతంటే?

చాలామందికి నిద్ర పోయేటప్పుడు తల దిండు లేకపోతే నిద్ర పట్టదు. ఈ తల దిండును ఒక్కోక్క ప్రదేశంలో ఒక విధంగా పిలుస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - June 25, 2022 / 08:30 AM IST

చాలామందికి నిద్ర పోయేటప్పుడు తల దిండు లేకపోతే నిద్ర పట్టదు. ఈ తల దిండును ఒక్కోక్క ప్రదేశంలో ఒక విధంగా పిలుస్తూ ఉంటారు. అయితే సహజంగా మనం వాడే తల్లిదండ్రులు ఖరీదు మహా అయితే 100 లేదో 1000 రూపాయలు వరకు ఉంటుంది. ఇంకొన్ని క్వాలిటీ ఖరీదు అయిన దిండ్లు అయితే దాని ఖరీదు ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకో పోతే ఒక దిండు ఖరీదు మాత్రం ఏకంగా అరకోటి. ఏంటి దిండు ఖరీదు అరకోటా! అని ఆశ్చర్యపోతున్నారా. ఇది నమ్మశక్యంగా లేక పోయినా ఇది నిజం.

పైన ఫోటోలో కనిపిస్తున్న దిండు ఖరీదు ఏకంగా కోటి రూపాయలు. మరి ఆ దిండు ప్రత్యేకత ఏమిటి? అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికోసం ఈ దిండును ప్రత్యేకంగా తయారు చేశారట. ఈ దిండు ఖరీదు విలువ 57 వేల డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా 45 లక్షలు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారి కోసం అనేక రకాల దిండు లు మార్కెట్లో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇందులో ఈ దిండు ఎందుకు అంత ఖరీదు? దాని స్పెషాలిటీ ఏంటి అనే విషయంలోకి వెళితే..

దీనిని నెదర్లాండ్ కు చెందిన ఫిజియోథెరపిస్ట్ తయారు చేశారు. ఇది ను తయారు చేయడం కోసం ఆ ఫిజియోథెరపిస్టు దాదాపుగా 15 సంవత్సరాల సమయం పట్టిందట. ఇందుకోసం అనేక పరిశోధనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ దిండు కాటన్ ను ఆ రోబోటిక్ మిల్లింగ్ మిషన్ ద్వారా అమర్చాడట. అంతేకాకుండా ఆ దిండు తయారీ కోసం బంగారం, డైమండ్ లను కూడా ఉపయోగించాడట. దిండు జిప్ కు నాలుగు ఖరీదైన డైమండ్ లు కూడా ఉన్నాయట. వీటితో పాటుగా నీలిరంగు రాయి కూడా ఆ దిండుకు అమర్చాడట. దీనితో ఆ దిండు ధర భారీగా పెరుగుతోంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు ఈ దిండు లు వేసుకుంటే ప్రశాంతంగా నిద్ర పోతారని ఆ ఫిజియోథెరపీస్ట్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు.