Most Dangerous Beaches: ఈ బీచ్ లకు వెళ్తే ప్రాణాలు పోవడం ఖాయం .. అవి ఏంటంటే?

బీచ్.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే ఒక ఆహ్లాదకరమైన ప్రదేశం.

  • Written By:
  • Publish Date - July 12, 2022 / 05:11 PM IST

బీచ్.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే ఒక ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇక్కడ బీచ్ కీ వెళ్లిన ప్రతి ఒకరు ఎంత పెద్దవారు అయినా చిన్న పిల్లల మారిపోయి అక్కడ ఇసుకలో ఆడుకుంటూ ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే చాలామంది వారికున్న టెన్షన్స్ కారణంగా రిలాక్స్ కోసం కూడా అటువంటి ప్రదేశాలకు వెళుతూ ఉంటారు. చుట్టూ కనిచూపుమేరలా నీరు, కాళ్లకు తాకుతూ వెళ్తున్న అలలు, దూరం నుంచి చూస్తే ఆకాశం నీలా కలిసిపోయినట్లుగా కనిపించే దృశ్యం అలా అంతా కూడా ఒక అద్భుతంగా ఉండే ప్రదేశం అని చెప్పవచ్చు. ఇలా బీచ్ ల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ప్రమాదంగా కూడా ఉండాలి. కొన్ని తీరాలు అయితే అసలు మంచివే కాదు చాలా ప్రమాదకరమైనవి. అక్కడ అడుగడుగునా ఆపదలు, మృత్యు ఏ విధంగా వెంటాడుతుందో తెలియదు. మరి అటువంటి బీచ్లు ఎక్కడ ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆ బీచ్ పేరు హనకపియామ్ బీచ్. ఇది హవాయి లోని కావాయ్ దీవిలో ఉంది. అయితే ఈ తీరంలో ప్రమాదకరమైన రిప్ కరెంట్స్ వంటివి ఉంటాయి. అవి ఇట్టే అక్కడికి వచ్చిన టూరిస్టులను లోపలికి లాగేసుకుంటాయి. అక్కడ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అలా ఇప్పటివరకు అక్కడ దాదాపుగా 83 మంది చనిపోయినట్లు అంచనా. అమెరికాలోని ఫ్లోరిడా సముద్రంలో రకరకాల చేపలు, జీవులు, మొసళ్ళు కనిపిస్తాయట. వాటిని చూడటం పట్టుకోవడం కోసం ఎక్కువగా టూరిస్ట్ లో అక్కడికి వెళుతూ ఉంటారు. కానీ అదే రాష్ట్రంలో న్యూ స్మిర్నా బీచ్ కి వెళ్లారు అంటే వారు వాళ్ళ ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. నీటిలో కొద్ది దూరం వెళ్లారు అంటే ఎటు నుంచి షార్క్ చేపలు వచ్చి దాడి చేస్తారు తెలియదు.

Beach

అంతే కాకుండా షార్క్ దాడుల రాజధాని గా ఈ బీచ్ చరిత్రకు ఎక్కింది అంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరొక బీచ్ అమెరికా దేశంలోని మెక్సికోలో ఉన్న ప్లాజా జిపో లైట్ బీచ్. ఈ బీచ్ చాలా ప్రాణాంతకమైనది. అక్కడి నీళ్లను చూస్తే లోపలికి వెళ్లి జలకాలాడాలి అనిపిస్తుంది. కానీ పొరపాటున లోపలికి వెళ్ళాము అంటే శక్తివంతమైన అండర్ కరెంట్స్ బారిన పడి చనిపోవాల్సిందే. అవి సుడుల అలాగా మనుషుల్ని లాగేసుకో గలవు. అందులో చిక్కితే ఎంత ఈత వచ్చిన వాళ్ళు అయినా తప్పించుకోవడం అసాధ్యం. ఈ బీచ్ లో లిస్టులో ఇండియా బీచ్ కూడా ఒకటి ఉంది. దాని పేరు చౌపట్టి బీచ్. ఇది ముంబైలో ఉంది. ఈ బీచ్ కాలుష్యం వల్ల ఈ లిస్టు లోకి చేరింది.

Beach

ఇక ఇందులో కాలుష్యం ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే బీచ్ కంటే ఎక్కువ శాతం చెత్తనే కనిపిస్తూ ఉంటుంది. ఆస్ట్రేలియాలోని ప్రాసెర్ బీచ్ కీ వెళ్లినా కూడా ఆ ప్రాణాలు వదులుకోవాల్సిందే. అయితే అక్కడ అన్నిటి వల్ల కాదు మరి ఇతర వల్ల కాదు అక్కడ నివసిస్తున్న డింగో జాతి ప్రజల వల్ల. అక్కడి ప్రజలు ప్రపంచంతో పూర్తిగా సంబంధం లేకుండా బతికేస్తూ ఉంటారు. పొరపాటున వారి ఇళ్ళ వైపు వెళ్లినా కూడా ప్రాణాలను తీసేస్తూ ఉంటారు. అలా వారి కంట పడకుండా బీచ్ కి వెళ్లడం అన్నది నిజంగా సాహసం అని చెప్పవచ్చు. దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదికి తీరంలో ఎన్నో రకాల బీచ్లు ఉన్నాయి. ఆ బీచ్లలో మనుషులను తినే చేపలు, అనకొండలు, ఎలక్ట్రిక్ ఈల్ చేపలు, ఫిరానాలు పిశాచ చేపలు ఉంటాయి.