Morocco Earthquake:ఉత్తర ఆఫ్రికా దేశంలో శుక్రవారం సంభవించిన భూకంపం వల్ల 2,000 మందికి పైగా మరణించారు. మొరాకోలో సంభవించిన భూకంపం విధాన్ని నింపింది. ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ఇల్లు కోల్పోయిన వారు కొందరైతే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆర్థిక చేయూత కోసం ఎదురుచూసే వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆ దేశానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. మొరాకో ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని అన్ని ప్రభుత్వ సంస్థలు మరియు బలగాలను ఆదేశించినట్టు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మొరాకో ప్రజలకు మేము చేయగలిగిన విధంగా మేము సహాయం చేస్తాము అని ప్రకటనలో పేర్కొన్నారు. రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ ఇజ్రాయెల్ రక్షణ దళాలను అత్యవసర సహాయాన్ని అందించడానికి సిద్ధం కావాలని ఆదేశించారు.దీనికి మొరాకో ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఇజ్రాయెల్ సహాయక చర్యలు మొదలవుతాయి. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం మొరాకోలో ఇప్పటివరకు ఇజ్రాయెల్ ప్రజల మరణాలు నమోదు కాలేదని తెలిపింది. ఉత్తర ఆఫ్రికా దేశంలో ప్రస్తుతం సుమారు 3,000 మంది యూదులు నివసిస్తున్నారు. కరోనావైరస్ ప్రయాణ పరిమితులు ముగిసినందున 2022లో 200,000 మందికి పైగా ఇజ్రాయెల్‌లు మొరాకోను సందర్శించారు.
Also Read: Things – Must Pay : ఈ వస్తువులు ఫ్రీగా తీసుకుంటే ఇక ఇక్కట్లే