Site icon HashtagU Telugu

Beer Sales: బీర్లను తెగ తాగేస్తున్నారు.. 17 రోజుల్లో కోటికి పైగా బీర్ల అమ్మకాలు!

Delhi Liquor Sale

170803 Oktoberfest Beer Friends Ed 1040a

ఏప్రిల్ నుంచి ఎండలు (Summer) దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad) లో అత్యథిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో యువత సహజంగానే బీర్లు తాగి సేదతీరాలనుకుంటోంది. ఏప్రిల్ 1 నుంచి 17వ తేదీ వరకు జరిగిన బీర్ల అమ్మకాల లెక్కతీస్తే సరికొత్త రికార్డుల వివరాలు బయటపడ్డాయి. ఏప్రిల్ లో కేవలం 17 రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ లో కోటికి పైగా బీర్లు (Beer Sales) అమ్ముడయ్యాయి. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. మూడు జిల్లాల్లో 8,46,175 కేస్‌ ల బీర్లు అమ్ముడైనట్టు ఆబ్కారీ శాఖ ప్రకటించింది. కేస్ కి 12 బీరు సీసాల లెక్కన మొత్తం 1,01,54,100 బీర్లు హైదరాబాద్ వాసులు లాగించేశారన్నమాట.

సహజంగా మందు బాబులు తమకి ఇష్టమైన బ్రాండ్లు మాత్రమే తీసుకుంటారు. యువత బీర్లవైపు (Beer Sales) మొగ్గు చూపుతుంటే.. మందు అలవాటైన వాళ్లు మాత్రం బీర్లను చిన్నచూపు చూస్తారు. కానీ ఇప్పుడు పెద్ద, చిన్న తేడా లేకుండా అందరూ బీర్లు లాగించేస్తున్నారు. విస్కీ, బ్రాంది తదితర బ్రాండ్లు అలవాటున్న వ్యక్తులు సైతం ఎండల ధాటికి తాళలేక చల్లని బీరు కావాలని అడుగుతున్నారట. గ్రేటర్ పరిధిలో రోజుకి సగటున 6 లక్షల బీర్లు అమ్ముడవుతున్నాయి. ఇక మున్ముందు ఎన్ని బీర్లు అమ్ముడుపోతాయోనని ఎక్సైజ్ అధికారులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.