Site icon HashtagU Telugu

Mopidevi: సుచరిత రాజీనామాపై మోపిదేవి వివరణ

Home Minister

Home Minister

ఏపీ సీఎం జగన్ కొత్త మంత్రివర్గం ఖరారు చేసిన వేళ… కొందరు తాజా మాజీల్లోనూ.. పలువురు ఆశావాహుల్లోనూ తీవ్ర అసంతృప్తి జ్వాలలు నెలకొన్నాయి. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తనను క్యాబినెట్ లో కొనసాగించనంుదకు తీవ్ర మనస్తాపం చెందారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. దీనిపై మేకతోటి సుచరిత కుమార్తు రిషిక స్పందిస్తూ..మంత్రి పదవితో ఎందుకు కొనసాగించలేదో పార్టీ నుంచి తగిన వివరణ ఇవ్వలేదని వాపోయారు. రాజీనామా లేఖను వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు ఇచ్చినట్లు చెప్పారు.

ఈ వ్యవహారంపై మోపిదేవి స్పందించారు. వైసీపీ అంతా ఒకటే ఫ్యామిలీ అన్నారు. అసంతృప్తులు ఉన్నా త్వరలోనే అవన్సీ సమసిపోతాయని పేర్కొన్నారు. మంత్రి పదవి ఒక్కటే ముఖ్యం కాదని తెలిపారు. కాగా మేకతోటి సుచరిత ఫ్యామిలీ గత కొన్ని రోజులుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసేందుక చాలా ప్రయత్నాలు చేసి విఫలం అయినట్లు తెలిసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పలువురిని కేబినెట్ లో కొనసాగిస్తూ.. తనను మాత్రం తప్పించడంపై సుచరిత వేదనకు గురైనట్లుగా సమాచారం.