హైదరాబాద్: మూసీ నదిలో వర్షపు నీరు ఎక్కువగా ప్రవహించడంతో మూసారంబాగ్ వంతెనను ట్రాఫిక్ పోలీసులు మంగళవారం మూసివేశారు. వంతెనపైకి వాహనాలు రాకుండా ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంబర్‌పేట్,ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రజలు గోల్నాక లేదా చాదర్‌ఘాట్ ద్వారా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వారు హెచ్చరికలు జారీ చేశారు.భారీ వర్షాలు, వరదల దృష్ట్యా పురానాపూల్‌లోని మూసీ నదికి సమాంతరంగా ఉన్న కొత్త జియాగూడ రహదారిని కూడా ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు.
Moosarambagh Bridge Closed : మూసీకి భారీగా వరదనీరు.. ముసారంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత

Moosarambagh bridge